ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్దిం చెందింది. సినిమాలో హీరో లేకుండానే సినిమా తీయొచ్చు. దర్శకులు టాలెంట్ ఉంటే గ్రాఫిక్స్ తో విజువల్ వండర్స్ నే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఒకప్పటి సినిమాలలో గ్రాఫిక్స్ అంటేనే తెలియదు. అయినప్పటికీ దర్శకులు తమ ప్రతిభను చూపించారు. గ్రాఫిక్స్ లేకుండానే ప్రేక్షకులకు విజువల్స్ ను అవాక్కయ్యేలా చూపించగలిగారు. ఇక అలాంటి సీన్ ఒకటి మాయాబజార్ సినిమాలో కూడా ఉంటుంది.
Advertisement
ALSO READ : మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణమైన సారధి ఎవరు? ఆయన ఏం చేస్తారు?
మాయాబజార్ సినిమా తెలుగులో ఎవర్ గ్రీన్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని వివాహ భోజనంబు పాటలోని విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే పాటలో గాల్లో లడ్డూలు ఎగురుతూ నోట్లోకి వెళ్లే సీన్ ఒకటి ఉంటుంది. ఘటోత్కచుడు భోజనం చేయడానికి సిద్దమైనప్పుడు ఆయన నోరు తెరవగానే నోట్లోకు లడ్డూలు వెళ్లిపోతాయి.
Advertisement
అయితే ఈ సీన్ గ్రాఫిక్స్ లేని కాలంలో ఎలా చిత్రీకరించారో ఆర్ట్ డైరెక్టర్ కళాదర్ పులుగం చిన్నారయణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారదర్శకంగా ఉండే పేపర్ తో ఒక గరిటె ను సిద్దం చేశామని చెప్పారు. ఇక ఆ గరిటెను ఘటోత్కచుడు నోట్లో పెట్టుకోగా ఆ గరిట పై నుండి లడ్డూలను కిందకి ప్లేట్ లోకి జారవిడిచినట్టు తెలిపారు.
ఆ సీన్ షూట్ చేసిన తరవాత దానిని రివర్స్ గా ఎడిట్ చేశామని అన్నారు. అలా తీసిన సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలిచిందని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమాలో చాలా సీన్ లను క్రియేటివిటితో తెరకెక్కించామని వెల్లడించారు. ఇక అలా తీసిన ఘటోత్కచుడు సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు మరియు అభిమానులు ఉన్నారు.
Advertisement
ALSO READ : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?