తెలుగు సినిమాల్లో హీరోలకు ఎంత పాపులారిటీ ఉంటుందో, విలన్లకు కూడా అంతే పాపులారిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సినిమా విజయం సాధించింది అంటే ఆ సినిమాకు హీరోకి వచ్చినట్టే, స్టార్ డమ్ అటు విలన్ కి కూడా వస్తుంది. దీంతో హీరో స్టార్ హీరో అయినట్లే, విలన్లు కూడా స్టార్ విలన్ గా మారిపోతారు. ఇలా హీరోకు హీరోలకు మించిన క్రేజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు రామిరెడ్డి.
ఇవి కూడా చదవండి: తెలంగాణ శకుంతల జీవితంలో ఇన్ని కష్టాలను ఎదుర్కొందా..?
Advertisement
నేటితరం ప్రేక్షకులకు రామిరెడ్డి తెలియకపోవచ్చు కానీ మూడు దశాబ్దాలకు ముందు రామిరెడ్డి అనే పేరు తెలియని వారు ఉండరు.ఎక్కువ విలన్ గానే కనిపించిన పెద్దరికం, అనగనగా ఒకరోజు లాంటి సినిమాల్లో మాత్రం టిపికల్ రోల్స్ చేశారు. అనగనగా ఒకరోజు, అడవి చుక్క, తెలుగోడు, జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా, వీడు మనవాడే ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాలు. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయసుకే 2011లో ఆయన కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి నరకం అనుభవించారు.
Advertisement
ఇవి కూడా చదవండి: ఇండస్ట్రీ హిట్ దిశగా “వీర సింహ రెడ్డి” ? దెబ్బకి పుష్ప రికార్డులు సైతం బద్దలయ్యాయి గా !
గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోయారు. చాలా కాలంపాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొని 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు. రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని ఓబులంవారి పల్లెలో జన్మించారు. ఆయన చదవంతా హైదరాబాదులోనే సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందిన ఈయన నటుడు కాక మునుపు ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
READ ALSO : జగన్ పై హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు.. తిట్టేందుకు ఓ శాఖ పెట్టుకోండి!