సినిమా హీరో అవ్వాలని ఎవరు కోరుకోరు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని చాలా మంది సినిమా ఆఫర్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ తండ్రి టాప్ నిర్మాత అయినా విక్టరీ వెంకటేష్ మాత్ర ఈ సినిమాలు వద్దు బాబోయ్…అమెరికాకు వెళ్లిపోదాం అని అనుకున్నారట. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. కెరీర్ ప్రారంభంలో వెంకటేష్ సినిమాల్లో నటించమంటే విసుక్కునేవారట.
Advertisement
అంతే కాకుండా అమెరికాకు వెళ్లాలని అక్కడే ఉద్యోగం చేయాలని నిర్నయించుకున్నారట. కానీ ఒక్క హిట్ వెంకటేష్ ను వెళ్లకుండా ఆపింది. అమెరికా వెళ్లిపోవాలని అనుకున్నప్పుడే వెంకటేష్ హీరోగా నటించిన కలియుగపాండవులు సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వెంకటేష్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో వెంకటేష్ కూడా కూడా సినిమాలపై ప్రేమ ఏర్పడిందట.
Advertisement
అంతే కాకుండా అమెరికా ప్రయాణం వాయిదా వేసుకుని సినిమాల్లో నటించడానికి కూడా అప్పుడే సిద్దం అయ్యారు. ఆ సినిమా హిట్ తరవాత చాలా సినిమాల్లో నటించినా మళ్లీ ప్లాప్ లు మొదలయ్యాయి. తండ్రి రామానాయుడు వెంకటేష్ స్క్రిప్ట్ లను పట్టించుకోకపోవడం..వెంకటేష్ కు ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియకపోవడంతో వచ్చిన సినిమాలన్నీచేస్తే అవి ఫ్లాప్ అవ్వడం జరిగేది.
అంతే కాకుండా ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంతో వెంకటేష్ మంచానికి పరిమితం అయ్యారు. అప్పుడు తమిళ హీరో భాగ్యరాజ్ సినిమాలు చూడటం ప్రారంభించాడు.ఆయన సినిమాలు తెగనచ్చడంతో ఆ సినిమాల రీమేక్ హక్కులను కొనుగోలు చేసి తెలుగులో చేయడం ప్రారంభించారు. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఆ సినిమాలు చేయగా హిట్లు పడటం షురూ అయ్యింది. అలా ఎన్నో విజయాలను అందుకుని వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయ్యాడు.