వడ్డే నవీన్ ఈ పేరు నేటి యూత్ కు తెలియకపోవచ్చు కానీ 90స్ వారికి పరిచయం అక్కర్లేదు. వడ్డే నవీన్ కోడి హీరోగా రామకృష్ణ దర్శకత్వంలో పెళ్లి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మల్లీశ్వరి నటించింది. అంతేకాకుండా వడ్డే నవీన్ చాలా బాగుంది, ప్రేమించే మనసు, మనసిచ్చి చూడు, మా బాలాజీ లాంటి సినిమాల్లో కూడా హీరోగా నటించాడు.
అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన నటనకు ఎంతో గుర్తింపు వచ్చింది. చివరగా వడ్డే నవీన్ మంచు మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత మరే సినిమాలోను కనిపించలేదు. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు వడ్డే నవీన్ మళ్లీ సినిమాలు చేయాలని కోరుతుంటారు. అంతేకాకుండా ఏ ఇంటర్వ్యూ వచ్చినా…. ఆ ఇంటర్వ్యూ కింద వడ్డే నవీన్ ను ఇంటర్వ్యూ చేయాలి అంటూ కామెంట్లు పెడుతుంటారు.
Advertisement
Advertisement
ఇక చాలాసార్లు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఇక వడ్డే నవీన్ సినిమాల గురించి చాలామందికి తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా వడ్డే నవీన్ కు టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో బావమరిది అవుతాడు అన్న సంగతి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. వడ్డే నవీన్ నందమూరి ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే మొదట వివాహం చేసుకున్నాడు.
నందమూరి తారక రామారావు కుమారుడు అయిన రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ మొదట వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. అంతేకాకుండా వ్యక్తిగత సమస్యల వల్లే వడ్డె నవీన్ సినిమాలకు దూరమయ్యారని కూడా ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వడ్డే నవీన్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ వడ్డే నవీన్ రియల్ లైఫ్ లో సంతోషంగా ఉన్నాడు. మరి ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన ఈ హీరో రీఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
మరిన్నీ తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !