Home » ఉదయ్ కిరణ్ కెరీర్ లో అట్టర్ ప్లాప్ అవుతుందనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది…! ఒక చిన్న మార్పు ఇలా చేసిందా..?

ఉదయ్ కిరణ్ కెరీర్ లో అట్టర్ ప్లాప్ అవుతుందనుకున్న సినిమా బ్లాక్ బస్టర్ అయింది…! ఒక చిన్న మార్పు ఇలా చేసిందా..?

by AJAY
Ad

లవర్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఉదయ్ కిరణ్ మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఉదయ్ కిరణ్ చిత్రం అనే ప్రేమ కథ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Advertisement

దాంతో ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ నువ్వు నేను అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడో సినిమా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసి పరుచూరి బ్రదర్స్ ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు.

Advertisement

udaykiran

udaykiran

అలా ఎందుకు అనుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం…. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎమ్మెస్ రాజు ఒక్క లవ్ స్టోరీ సినిమాను కూడా తెరకెక్కించలేదు. ఆయన కెరీర్ లోనే ఇది మొదటి లవ్ స్టోరీ కావడం విశేషం. అంతేకాకుండా ఎమ్మెస్ రాజు విఎన్ ఆదిత్య లాంటి కొత్త కుర్రాడికి అవకాశం ఇచ్చి సినిమాను తీయించాడు. అయితే ఎమ్మెస్ రాజు కూడా ఈ సినిమా కథ కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఆ తర్వాతే వియన ఆదిత్య పూర్తి కథను సిద్ధం చేసుకుని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ కూడా పనిచేశారు.

అయితే సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మరియు పరిచూరి బ్రదర్స్ కలిసి సినిమాను చూశారు. కాగా సినిమా క్లైమాక్స్ చూసి పరుచూరి బ్రదర్స్ సినిమా ఫ్లాప్ అవుతుందని జోష్యం చెప్పారు. దాంతో విఎన్ ఆదిత్య ఒక్కసారి గా షాక్ అయ్యాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి ఎడిటర్ సినిమా ప్రారంభంలో వచ్చే నీ స్నేహం పాటను క్లైమాక్స్ లో కూడా యాడ్ చేశాడట. ఆ తర్వాత సినిమా చూసి పరుచూరి బ్రదర్స్ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పారట. ఇక వాళ్ళు చెప్పినట్టుగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading