Home » ఉద‌య్ కిర‌ణ్ త‌రుణ్ కాంబోలో ఓ మ‌ల్టీ స్టారర్ మిస్ అయ్యిందని తెలుసా..? ఎవ‌రివ‌ల్ల మిస్ అయ్యిందంటే..?

ఉద‌య్ కిర‌ణ్ త‌రుణ్ కాంబోలో ఓ మ‌ల్టీ స్టారర్ మిస్ అయ్యిందని తెలుసా..? ఎవ‌రివ‌ల్ల మిస్ అయ్యిందంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో చాలా సినిమాల్లో ముందుగా ఓ న‌టుడిని అనుకుంటే ఆ త‌ర‌వాత మ‌రొక‌రితో చేయాల్సి వ‌స్తుంది. అందుకు ఎన్నో కార‌ణాలు ఉంటాయి. అలా ఉద‌య్ కిర‌ణ్, త‌రుణ్ కాంబినేష‌న్ లో రావాల్సిన ఓ మ‌ల్టీ స్టార‌ర్ కూడా ఆగిపోయింది అన్న విష‌యం చాలా మందికి తెలియదు. త‌రుణ్ ఉద‌య్ కిర‌ణ్ ఇద్ద‌రూ కూడా ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోలు.

Advertisement

వీరిద్ద‌రూ స్టార్స్ గా ఎద‌గాల్సిన వాళ్లు కూడా…కానీ జీవితంలో వ‌చ్చిన ఇబ్బందులు ఇత‌ర కార‌ణాల వల్ల స్టార్ హీరోలుగా ఎద‌గ‌లేక పోయారు. ఇక త‌రుణ్ ప్ర‌స్తుతం సినిమాల‌కు పూర్తిగా దూరం అయితే ఉద‌య్ కిర‌ణ్ ఏకంగా ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయారు. కాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రావాల్సిన మ‌ల్టీ స్టార‌ర్ ఎందుకు ఆగిపోయింది…? అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం..? ఉద‌య్ కిర‌ణ్, త‌రుణ్ 2000 కాలంలో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌తో దూసుకుపోయారు.

Advertisement

Uday kiran

Uday kiran

ఆ స‌మ‌యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎంఎస్ రాజు ఇద్ద‌రితో క‌లిసి ఓ మ‌ల్టీ స్టార‌ర్ సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ఎంఎస్ రాజు నిర్మాణంలో మ‌న‌సంతానువ్వే సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ సినిమా త‌ర‌వాత ఎంఎస్ రాజు ఉద‌య్ కిర‌ణ్ హీరోగా నీ స్నేహం అనే సినిమాను ప్లాన్ చేశారు. 2002 లో విడుద‌లైన ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకుంటుందని అనుకున్నారు.

కానీ ఈ సినిమా అంచ‌నాల‌ను రీచ్ అవ్వ‌లేక‌పోయింది. అయితే ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఎంఎస్ రాజు ఓ ఇంట‌ర్య్వూలో వెల్లడించారు. నీ స్నేహం సినిమాలో ఉద‌య్ కిర‌ణ్ స్నేహితుడి పాత్ర కోసం ముందుగా త‌రుణ్ ను అనుకున్నామ‌ని చెప్పారు. కానీ త‌రుణ్ పాత్ర‌ను రిజెక్ట్ చేశాడ‌ని చెప్పారు. దాంతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని జ‌తిన్ గ్రేవాన్ ను తీసుకున్నామ‌ని తెలిపారు. దాంతో ఈ సినిమా అటు ల‌వ్ స్టోరీ కాకుండా ఇటు ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ కాకుండా పోయింద‌ని చెప్పారు.

Visitors Are Also Reading