Home » సూర్యకాంతం గారు చనిపోయిన రోజు జరిగిన దారుణమైన సంఘటన ! వింటే కన్నీరు పెట్టకుండా ఉండలేరు ..!

సూర్యకాంతం గారు చనిపోయిన రోజు జరిగిన దారుణమైన సంఘటన ! వింటే కన్నీరు పెట్టకుండా ఉండలేరు ..!

by AJAY
Ad

ఒక‌ప్ప‌టి న‌టి సూర్య‌కాంతం అంటే తెలియని సినీప్రియులు ఉండ‌రు. ఎన్ని సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి సూర్య‌కాంతం అభిమానుల‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అత్త‌పాత్ర‌ల‌కు సూర్య‌కాంతం పెట్టింది పేరు. శాడిస్ట్ అత్త‌పాత్ర చేయాలంటే అది సూర్య‌కాంతం త‌ర‌వాత‌నే ఎవ‌రైనా అని చెప్పాలి. దాదాపు నాలుగున్న‌ర ద‌శాబ్దాల పాటూ సూర్య‌కాతం విభిన్న పాత్ర‌లతో ప్రేక్షకుల‌ను అల‌రించింది. చాలా సినిమాల్లో చేతిక‌ర్ర ప‌ట్టుకుని క‌నిపిస్తూ గ‌య్యాలి పాత్ర‌లో జీవించేసింది.

Advertisement

ఇప్ప‌టికే మా అత్త ఓ సూర్య‌కాంతం అని కోడ‌ల్లు చెప్పుకుంటారు అంటే ఆమె ప్ర‌భావం ఎంత‌లా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తెర‌పై వెలుగువెలిగిన సూర్య‌కాంతం ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. సూర్య‌కాంతం తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడలోని వెంక‌ట‌కృష్ణాపురంలో జ‌న్మించారు. 1924 అక్టోబ‌ర్ 28 వ తేదీన పొన్నాడ అనంత‌రామయ్య‌, ర‌త్త‌మ్మ దంపతుల‌కు జ‌న్మించారు. చిన్న‌వ‌య‌సులోనే సూర్య‌కాంతంకు న‌ట‌న‌పై ఆస‌క్తి ఉండేది.

Advertisement

పాట‌లు పాడటం డ్యాన్స్ చేయ‌డం లాంటివి చేస్తుండేవారు. చిన్న‌వ‌య‌సులో సూర్య‌కాంతం హిందీ సినిమా పోస్ట‌ర్లు చూసి సినిమాలకు ఆక‌ర్షితుల‌య్యార‌ట‌. ఇక సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌కుండానే చెన్నై ట్రైన్ ఎక్కార‌ట‌. సూర్య‌కాంతం మొద‌టిసారి గృహ‌ప్ర‌వేశం అనే సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించారు. ఆ త‌ర‌వాత 1952లో పెళ్లి చేసి చూడు అనే సినిమాలో అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నారు.

విజ‌య సంస్థ‌తో ఉన్న అనుబంధం వ‌ల్ల సూర్య‌కాంతం కెరీర్ లో ఎద‌గ‌డానికి స‌హాయ‌ప‌డింది. ఇదిలా ఉండ‌గా సూర్య‌కాంతం 1996 డిసెంబ‌ర్ 17న మ‌ర‌ణించారు. అంబులెన్స్ లో సూర్య‌కాంతం డెడ్ బాడీని తీసుకువ‌స్తే ఆమె వెంట ఒక్క‌రు కూడా లేక‌పోవాడం బాధాక‌రం. ఇండ‌స్ట్రీలో టాప్ న‌టిగా కొన‌సాగిన సూర్య‌కాంతం డెడ్ బాడీ వ‌ద్ద రాత్రంతా ముగ్గురు మాత్ర‌మే ఉన్నారు. వాళ్లు ఆమె కుటుంబ స‌భ్యులు క‌జిన్, ద‌త్త‌పుత్రుడు, మ‌రియు కోడ‌లు మాత్ర‌మే. మ‌ద్రాస్ లో చ‌నిపోయిన సూర్య‌కాంతం డెడ్ బాడీని చూసేందుకు హైదరాబాద్ నుండి ఒక్క‌రు కూడా వెళ్ల‌లేదు. దాంతో మ‌రుస‌టి రోజులు ఆమె కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిచేశారు.

Visitors Are Also Reading