Home » సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల పెళ్లికి ఇందిర గారిని ఎవరు ఒప్పించారో తెలుసా…? వెనకుంది అతనే…!

సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల పెళ్లికి ఇందిర గారిని ఎవరు ఒప్పించారో తెలుసా…? వెనకుంది అతనే…!

by AJAY
Published: Last Updated on
Ad

ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి కృష్ణ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆ రోజుల్లోనే ప్రయోగాత్మక సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. కృష్ణ తేనె మనసులు సినిమా ద్వారా టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యారు.

Advertisement

మరోవైపు హాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కౌబాయ్ సినిమాలను టాలీవుడ్ కు కూడా పరిచయం చేసారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అంటే గుర్తుకువచ్చే ముఖం కూడా కృష్ణదే అంటే ఆయన ఏ రేంజ్ లో ఆ పాత్రలో ఒదిగిపోయారో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో విజయనిర్మల ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. హిట్ పెయిర్ కొనసాగుతున్న వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత గా ప్రేమించుకున్నారు. అయితే అప్పటికే కృష్ణకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలను గుడిలో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

Also Read:  భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?

కాగా కృష్ణ విజయనిర్మల వివాహం గురించి ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కృష్ణ విజయ నిర్మల ను చేసుకున్న తర్వాత తమ తల్లి గారు చాలా కాలం పాటు అంగీకరించలేదని చెప్పారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంతా సర్దుకుపోయిందని అన్నారు. కృష్ణ భార్య గారు తన వదిన ఇందిర గారికి తానే సర్ద్దిచెప్పానని ఆదిశేషగిరిరావు చెప్పారు.

కృష్ణకు విజయనిర్మల చేదోడువాదోడుగా ఉండేవారని సినిమాల విషయంలో ఎంతో సపోర్ట్ ఇచ్చేవారని అన్నారు. ఇదిలా ఉంటే విజయనిర్మల 2019లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సూపర్ స్టార్ ఎంతో కుంగిపోయారు. ఇక ప్రస్తుతం కృష్ణ కూడా వృద్ధాప్యంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఒకప్పుడు విజయ నిర్మల గారితో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం ఆయన కూడా ఇంటి నుండి బయటకు రావడం లేదు.

Also Read:   మోహన్ బాబు కి పిల్లనివ్వడానికి కుడా ఎందుకు వణికిపోయేవారు ? రెండవ వివాహం ఎందుకు చేసుకున్నారంటే ?

Visitors Are Also Reading