Home » ఆ స్టార్ హీరో ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికుండేదా…? ఆ హీరో ఎందుకలా చేశాడు…!

ఆ స్టార్ హీరో ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికుండేదా…? ఆ హీరో ఎందుకలా చేశాడు…!

by AJAY
Ad

కొంత‌మంది న‌టీన‌టులు భౌతికంగా మ‌న మ‌ధ్య‌న లేక‌పోయినా వారు న‌టించిన సినిమా ద్వారా ఎప్పుడూ ప్రేక్ష‌కుల మ‌దిలో న‌లిచిపోయారు. అలాంటి న‌టీన‌టుల‌లో సిల్క్ కూడా ఒక‌రు. సిల్క్ జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం. సినిమాల్లో న‌టించిన సిల్క్ స్మిత నిజ‌జీత‌మే ఓ పెద్ద సినిమా అని చెప్ప‌వ‌చ్చు. ఎన్నో ఇబ్బుందుల్లో నుండి వ‌చ్చిన సిల్క్ స్మిత ఇండ‌స్ట్రీలో బిజీ నటిగా మారిపోయింది.

Advertisement

సినిమాల‌లోకి వ‌చ్చిన కొత్త‌లో సిల్క్ మేక‌ప్ ఆర్టిస్ట్ గా ప‌నిచేసేది. ఆమెను చూసి ఓ ద‌ర్శ‌కుడి భార్య చాలా అందంగా ఉందని చెప్ప‌డంతో సైడ్ డ్యాన్స‌ర్ గా అవ‌కాశం అందుకుంది. ఆ త‌ర‌వాత త‌న హాట్ లుక్స్ తో మ‌గవాళ్ల‌కు మ‌త్తెక్కించ‌డంతో వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. స్టార్ హీరోలు సైతం త‌న డేట్స్ కోసం వేచి చూసే స్థాయికి సిల్క్ స్మిత ఎదిగింది.

Advertisement

కానీ మెల్లిమెల్లిగా అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్టడం అయినవాళ్లే మోసం చేయ‌డంతో చివ‌రికి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెష‌న్ లో ఉన్న స‌మ‌యంలోనే మ‌త్తుపదార్థాల‌కు బానిసై ఆర్థిక ఇబ్బుందులు ఎదురుకుంది. అంతే కాకుండా త‌న‌ను ఓ వ్య‌క్తి మోసం చేశాడంటూ సిల్క్ చివ‌రికి లెట‌ర్ రాసి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఈ లోకానికి దూరం అయ్యింది. ఇక సిల్క్ స్మిత తెలుగుతో పాటూ త‌మిళ‌, కన్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆమెకు అన్ని భాష‌ల్లో న‌టీన‌టులు స్నేహితులు ఉన్నారు.

క‌న్న‌డ స్టార్ హీరో రవిచంద్ర‌న్ సిల్క్ మంచి స్నేహితులు. వీరిద్ద‌రూ క‌లిసి మొద‌టిసారి హ‌ల్లి మేస్త్రు అనే సినిమాలో న‌టించారు. షూటింగ్ స‌మ‌యంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం తో ఇద్ద‌రూ చాలా క్లోజ్ అయ్యారు. సిల్క్ త‌న జీవితంలోని అన్ని విష‌యాల‌ను త‌న‌తో పంచుకునేద‌ని రవిచంద్ర‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. చనిపోయే ముందురోజు కూడా సిల్క్ త‌న‌కు ఫోన్ చేసింద‌ని ర‌విచంద్ర‌న్ తెలిపారు. కానీ తాను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఫోన్ లిఫ్ట్ చేయ‌లేక‌పోయాన‌ని చెప్పారు. మామూలు కాల్ అనుకుని తాను తిరిగి ఫోన్ కూడా చేయ‌లేద‌ని అన్నారు.తాను ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్ర‌తికి ఉండేదేమో అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Visitors Are Also Reading