Telugu News » Blog » మొద‌ట చిరంజీవి ఆ స్టార్ హీరో కూతురుతో చ‌ర‌ణ్ పెళ్లి సెట్ చేశాడా..? కానీ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే..?

మొద‌ట చిరంజీవి ఆ స్టార్ హీరో కూతురుతో చ‌ర‌ణ్ పెళ్లి సెట్ చేశాడా..? కానీ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందంటే..?

by AJAY
Ads

మెగాస్టార్ త‌న‌యుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్నాడు. చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమాతో స్టార్ గా ఎదిగాడు. ఇక రంగ‌స్థ‌లం సినిమాతో చ‌ర‌ణ్ త‌న‌లోని న‌టుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసుకున్నాడు. అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఇక‌ రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం త‌మిళ‌స్టార్ డైరెక్ట‌ర్ తో మ‌రో పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నాడు.

Ads

ఈ సినిమా భారీ బడ్జెట్ తో పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇక రామ్ చ‌ర‌ణ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఉపాస‌న‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఉపాస‌న అపోలో బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. ఉపాస‌న చ‌ర‌ణ్ మొద‌ట ఫ్రెండ్స్ కాగా ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో పడ్డారు. దాంతో ఇరుకుంటుబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి వ‌య‌సు రాగానే ఇంట్లో సంబంధాలు చూస్తార‌న్న సంగ‌తి తెలిసిందే.

Ads

అయితే పెళ్లిళ్లి మాత్రం స్వ‌ర్గంలో నిశ్చ‌యించ‌బ‌డ‌తాయ‌ని ఎవ‌రితో రాసిపెట్టి ఉంటే వారితోనే జ‌రుగుతాయ‌ని పెద్ద‌లు చెబుతుంటారు.చ‌ర‌ణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ట‌. చ‌ర‌ణ్ కు మొద‌ట ఓ స్టార్ హీరో కూతురును ఇచ్చి వివాహం చేయాల‌ని చిరంజీవి అనుకున్నార‌ట‌. ఆ స్టార్ హీరో మ‌రెవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్.

Ad

ముందు నుండి ద‌గ్గుబాటి ఫ్యామిలీతో చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. కాగా వెంక‌టేష్ కూతురు అశ్రిత‌ను రామ్ చ‌ర‌ణ్ కు ఇవ్వాల‌ని చిరంజీవి అనుకున్నార‌ట‌. ఇక ఇదే విష‌యాన్ని చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ కు చెప్పగా తాను ఉపాస‌న‌ను ప్రేమిస్తున్న‌ట్టు తెలిపాడ‌ట‌. దాంతో చిరంజీవి కొడుకు ఇష్టం మేర‌కు ఉపాస‌న‌తో చ‌ర‌ణ్ వివాహం జ‌రిపించారు.