Home » నేటి ఈ అగ్ర హీరోలు ఒకప్పుడు ఎక్కడ ఉండే వారు ? ఏ జాబ్స్ చేసేవారంటే ?

నేటి ఈ అగ్ర హీరోలు ఒకప్పుడు ఎక్కడ ఉండే వారు ? ఏ జాబ్స్ చేసేవారంటే ?

by AJAY
Ad

సినిమాల్లో రానించాలంటే మందు బ్యాగ్రౌండ్ ఉండాల‌ని చెబుతుంటారు. అయితే ఇదంతా ఇప్ప‌టి మాట కానీ ఒక‌ప్పుడు ఎంతోమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి స్టార్ హీరోలు ఎదిగారు.

Advertisement

ప్ర‌స్తుతం వాళ్లు దేశ‌వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వాళ్లు సినిమాల్లోకి రాక‌ముందు ఏం చేశార‌న్నది మాత్రం చాలా మందికి తెలియ‌దు. కానీ వాళ్లు సినిమాల్లోకి రాక‌ముందు చేసిన ప‌నులు చూస్తే మాత్రం క‌చ్చితంగా వారిని ఆద‌ర్శంగా తీసుకుని ఏదైనా సాధించ‌గ‌లం అనే ధైర్యం వ‌స్తుంది.

Rajinikanth

Rajinikanth

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్ర‌స్తుతం స్టార్ హీరో. ఇండియాతో పాటూ జ‌పాన్ ఇత‌ర దేశాల్లోనూ ర‌జినీకి అభిమానులు ఉన్నారు. కానీ ర‌జినీకాంత్ కెరీర్ ప్రారంభంలో కూలీ, కార్ పేంట‌ర్ ,బ‌స్ కండ‌క్ట‌ర్ గా ఒక్కో ద‌శ‌లో ప‌నిచేశాడు. సినిమాల పై ఉన్న ఆస‌క్తి క‌సి ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించ‌గా అత‌డిని సూపర్ స్టార్ గా నిలబెట్టింది.

sharukh khan family

sharukh khan family

బాలీవుడ్ బాద్షా కూడా సామాన్యుడే. ఢిల్లీలో షారుక్ ఖాన్ కు చిన్న హోట‌ల్ ఉండ‌ది. న‌ష్టాలు రావ‌డంతో దాన్ని మూసేసి సినిమాల పై ఉన్న ఆస‌క్తితో ముంబైకి వెళ్లాడు. అక్క‌డ షారుక్ ఎన్నో క‌ష్టాలు అనుభవించాడు. మొద‌ట దూర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్స్ లో నటించి ఆ త‌ర‌వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఎదిగాడు.

Advertisement

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో క‌ష్టాల‌ను చూశాడు. ఒక‌ప్పుడు మెరైన్ డ్రైవ్ లో ఒంట‌రిగా గ‌డిపేవాడు. రేడియో స్టేష‌న్ ల చుట్టూ అవ‌కాశాల కోసం తిరిగాడు. ఇక సినిమా ఆఫ‌ర్ లు వ‌చ్చినా వ‌రుస‌గా ప‌న్నేండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా శ్ర‌మించి బాలీవుడ్ బిగ్ బీగా ఎదిగాడు.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లోని స్టార్ హీరోల లిస్ట్ లో అక్ష‌య్ కుమార్ కూడా ఒక‌రు. అక్ష‌య్ కెరీర్ ప్రారంభంలో వెయిట‌ర్ గా ప్యూన్ గా, చెఫ్ గా ప‌నిచేశాడు. అస‌లు నువ్వు సినిమాల‌కే పనికిరావ‌న్న అక్ష‌య్ ప్ర‌స్తుతం స్టార్ హీరోగా మారిపోయాడు.

vijay dewarakonda

vijay dewarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేశాడు. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిల్మ్స్ లో కూడా న‌టించాడు. కానీ ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పనిచేశాడు. ఆ త‌ర‌వాత రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన అల్ల‌రి ప్రియుడు సినిమాలో చిన్న రోల్ చేశాడు. ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. క‌సి ప‌ట్టుద‌ల‌తో చివ‌రికి స్టార్ గా ఎదిగాడు.

ALSO READ : చిరంజీవిపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న ఆ ద‌ర్శ‌కులు.. అస‌లు కార‌ణం ఏంటంటే..?

Visitors Are Also Reading