Home » ఎన్టీఆర్ వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చరిత్ర సినిమా తెర‌వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..? ఇందిరాగాంధీ విడుద‌ల‌ను ఎందుకు అడ్డుకున్నారు..?

ఎన్టీఆర్ వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చరిత్ర సినిమా తెర‌వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..? ఇందిరాగాంధీ విడుద‌ల‌ను ఎందుకు అడ్డుకున్నారు..?

by AJAY
Ad

న‌ట‌సార్వ‌భూముడు నంద‌మూరి తార‌క‌రామారావు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నారు. సాంఘీక‌..రాజ‌కీయ..పౌరాణిక…జాన‌ప‌ద చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కేవ‌లం ఒకేర‌క‌మైన పాత్ర‌ల‌లో న‌టించ‌కుండా అన్ని ర‌కాల పాత్ర‌ల‌లో న‌టించి టాలీవుడ్ లో చ‌రిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ ఎప్పూడూ డిఫ‌రెంట్ పాత్ర‌ల‌నే చేయ‌డానికి ఆస‌క్తి చూపించేవారు. ప్ర‌తి పాత్ర‌ను ఆయ‌న చాలెంజింగ్ గా తీసుకుని అందులో న‌టించేవారు.

Advertisement

ఇక ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చ‌రిత్ర కూడా ఒక‌టి. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటూ బ్ర‌హ్మం గారి చరిత్ర చాలా మందికి తెలిసింది. అయితే ఈ సినిమా చేయ‌డానికి ముందు చాలా క‌థ జరిగింది అన్న సంగ‌తి అతికొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. ఎన్టీఆర్ ఒకానొక స‌మ‌యంలో క‌డ‌ప జిల్లా సిద్ద‌ప‌టంలోని పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి ఆశ్ర‌మానికి వెళ్లారు. కాగా అక్క‌డ ఓ విష‌యాన్ని చ‌దివారు.

Advertisement

తెర‌మీద రెండు బొమ్మ‌లు ఏదో ఒక‌రోజు అధికారంలోకి వ‌స్తాయ‌ని బ్ర‌హ్మంగారి చ‌రిత్ర‌లో ఉన్న విష‌యాన్ని చ‌దివారు. అప్పుడే ఎన్టీఆర్ ఆ పాత్ర‌లో న‌టించాల‌ని అనుకున్నారు. నిజ‌మైన దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమోన‌ని భావించారు. అంతే కాకుండా అక్క‌డ ఉన్న బ్ర‌హ్మంగారి చెప్పులు ఎన్టీఆర్ కు స‌రిగ్గా స‌రిపోవ‌డం విశేషం. అప్పుడు ఎన్టీఆర్ కు ఆ సినిమా చేయాలని కోరిక క‌ల‌గ‌డంతో వెంట‌నే సినిమాలో న‌టించారు.

ఇదిలా ఉంటే ఆ సినిమా స‌మ‌యంలో ఎన్టీఆర్ భ‌విష్య‌త్ లో ఖ‌చ్చితంగా సీఎం అవుతార‌ని కొంత‌మంది ఇందిరా గాంధీకి చెప్పార‌ట‌. దాంతో ఇందిరా గాంధీ ఆదేశాల‌తో మద్రాస్ సెన్సార్ బోర్డ్ సినిమా కు అభ్యంత‌రం తెలుపుతూ క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేద‌న్న టాక్ కూడా అప్ప‌ట్లో వినిపించింది. కానీ ఎన్టీఆర్ న్యాయ పోరాటం చేయ‌గా మూడేళ్ల త‌ర‌వాత ఈ సినిమా విడుద‌లైంది. అంతే కాకుండా ఈ సినిమా విడుద‌ల‌య్యేనాటికి ఎన్టీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారు.

Visitors Are Also Reading