Home » భ‌ర్త కంటే భార్య వ‌య‌సులో 10 ఏళ్లు పెద్ద‌…ఆ సినిమా చూసి సెన్సార్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే..?

భ‌ర్త కంటే భార్య వ‌య‌సులో 10 ఏళ్లు పెద్ద‌…ఆ సినిమా చూసి సెన్సార్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం కామెడీ సినిమాలు చేయాలంటే అల్ల‌రి న‌రేష్..ఇక ఒక‌ప్పుడు కామెడీ సినిమాలు చేయాలంటే రాజేంద్ర‌ప్ర‌సాద్ పేరు వినిపించేది. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించి రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లను రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎంచుకునేవారు. ఈ క్ర‌మంలోనే రాజేంద్ర‌ప్ర‌సాద్ మూడు ముళ్ల బంధం అనే సినిమాలో న‌టించారు.

Advertisement

ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పొన్న‌తోట ర‌ఘురాం నిర్మించారు. ఓ సినిమాకు ర‌ఘురాం ప్రొడ‌క్ష‌న్ మ్యానేజ‌ర్ గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద‌కు వెళ్లి తాను ఓ సినిమాను నిర్మిస్తాన‌ని చెప్పారు. దాంతో ముత్యాల సుబ్బ‌య్య తాను రాసిన క‌థ‌ను వినిపించారు. అప్పటి వ‌ర‌కూ చాలా రొటీన్ క‌థ‌ల‌ను విన్న ర‌ఘురాం కు ముత్యాల సుబ్బ‌య్య చెప్పిన క‌థ డిఫ‌రెంట్ గా అనిపించింది.

Advertisement

ఇకీ సినిమాలో మొద‌ట హీరో హీరోయిన్ లు గా బాల‌కృష్ణ‌, వాణిశ్రీ ల‌ను అనుకున్నారు. కానీ అది కుద‌ర‌క‌పోవ‌డంతో రాజేంద్ర‌ప్ర‌సాద్ మాధవి ల‌ను తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పెళ్లి జ‌రుగుతుంటే పెళ్లి కొడుకు పీట‌ల మీద‌నే చ‌నిపోతాడు. దాంతో అంద‌రూ హీరోయిన్ ను నిందిస్తూ ఉంటారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న ప‌దేళ్ల బాలుడు హీరోయిన్ మెడ‌లో తాలి క‌డ‌తాడు.

ఇక పెరిగి పెద్ద‌యిన త‌ర‌వాత ఆ బాలుడు మ‌రొక‌రిని ల‌వ్ చేస్తాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల‌కు సిద్దం గా ఉన్న స‌మ‌యంలో ప్రివ్య్వూ చూసిన సెన్సార్ స‌భ్యులు అస‌లు మూడు గంట‌ల పాటూ బ‌య‌ట‌కు రాలేదు. అంతే కాకుండా అభ్యంత‌రం తెలిపారు. ఇది బాల్య‌వివాహాల‌ను ప్రోత్స‌హించేలా ఉంద‌ని వాదించారు. కానీ ద‌ర్శ‌కుడు ముత్యాల సుబ్బ‌య్య మూడు నెల‌ల పాటూ సెన్సార్ స‌భ్యుల‌తో పోరాటం చేశాడు. చివ‌ర‌కు ఈ సినిమాను విడుద‌ల చేయగా ఫ్లాప్ అయ్యింది.

Visitors Are Also Reading