Home » మంచు విష్ణు భార్య ఎవరో తెలుసా..? డాక్టర్ అవ్వాల్సిన ఆమె మంచు వారింటింకి పెద్ద కోడలయ్యింది..!

మంచు విష్ణు భార్య ఎవరో తెలుసా..? డాక్టర్ అవ్వాల్సిన ఆమె మంచు వారింటింకి పెద్ద కోడలయ్యింది..!

by AJAY
Ad

మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్న విష్ణు రీసెంట్ గా మా ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడి పదవిని చేపట్టారు. మా ఎన్నికల సమయంలో విష్ణు సతీమణి వెరోనికా కూడా మీడియా ముందు కనిపించారు. అయితే విష్ణు భార్య వెరోనిక గురించి చాలా మందికి తెలియదు. అసలు వెరోనికా ఎవరు…?

Advertisement

మంచు విష్ణుతో పెళ్లి ఎలా కుదిరింది…? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…. మంచు విష్ణుకు సినిమా బ్యాగ్రౌండ్ ఉంటే వెరోనికాకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వెరోనికా సోదరి అవుతుంది. రాజారెడ్డి కుమారులలో ఒకరు అయిన సుధాకర్ రెడ్డి కూతురే వెరోనికా. ఆమె తల్లిదండ్రులిద్దరూ వ్యాపారవేత్తలు. వెరోనిక అమెరికాలోనే పుట్టి అక్కడే చదువుకుంది.

Advertisement

నిజానికి వెరొనిక డాక్టర్ అవ్వాలని కలలు కనింది. కానీ స్కూల్ లో ఉన్నప్పుడు వాలంటీర్ గా సేవలు అందించేందుకు ఓ ఆస్పత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో శవాలను చూసి వేరోనికా భయపడిపోయింది… ఆ తర్వాత డాక్టర్ అవ్వకూడదని నిర్ణయించుకుంది. ఇక వెరోనికా వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరి కూతురు అయినప్పటికీ వైఎస్ఆర్ సొంత కూతురు షర్మిల ను చూసుకున్నట్టే చూసుకునేవారట. మంచు విష్ణు ఢీ సినిమా చేస్తున్న సమయంలో వె రోనికా అతడికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ సమయంలోనే మంచి విష్ణు వెరోనికాల మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త కొంతకాలానికి ప్రేమగా మారింది. మంచు విష్ణు యాటిట్యూడ్ మంచితనం నచ్చడంతో వెరోనిక అతడితో ప్రేమలో పడిపోయిందట. ఆ తర్వాత ఇద్దరు తమ పేరెంట్స్ ను ఒప్పించారు. ఇక 2009 మార్చ్ 1న అంగరంగవైభవంగా మంచు విష్ణు వెరోనికా ల వివాహం జరిగింది. ఈ పెళ్ళికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి నలుగురు సంతానం ఉన్నారు. వారిలో ముగ్గురు కూతుళ్ళు కాగా ఒక బాబు ఉన్నాడు.

Also read : “విక్రమార్కుడు” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా..? ఆ సినిమా గనక చేసి ఉంటే…!

Visitors Are Also Reading