Home » అలాంటి స‌న్నివేశాల్లో న‌టించిన త‌రువాత‌… సావిత్రి..

అలాంటి స‌న్నివేశాల్లో న‌టించిన త‌రువాత‌… సావిత్రి..

by Bunty
Ad

మ‌హాన‌టి సావిత్రి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చ‌విచూశారు. నిశ్శంక‌రం సావిత్రి మ‌హాన‌టిగా ఆమె జీవ‌న ప్ర‌స్థానం సాగిన తీరు చూస్తే ఎవ‌రైనా స‌రే ఔరా అనేస్తారు. న‌ట‌నే జీవితంగా భావించి చిన్న‌త‌నంలోనే నృత్యాన్ని నేర్చుకున్నారు. ఆ త‌రువాత సావిత్రి నాట‌క‌రంగంలోకి ప్ర‌వేశించి అనేక నాట‌కాలు వేశారు. ఎన్టీఆర్‌, జ‌గ్గ‌య్య త‌దిత‌రులు నెల‌కొల్పిన నాట‌కస‌మాజంలో ఆమె నటించి మెప్పించారు. అప్ప‌టి ప్ర‌ముఖ హిందీ న‌టుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా నాట‌క‌రంగంలో అవార్డును అందుకున్నాక సినిమాపై మ‌క్కువ ఏర్ప‌డింది.

Advertisement

Advertisement

సినిమా రంగంలోకి ప్ర‌వేశించేందుకు సావిత్రి త‌న పెద‌నాన్న‌తో క‌లిసి మ‌ద్రాస్ వెళ్లింది. అక్క‌డ ఆమెకు ఎల్వీప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో సంసారం సినిమాలో అవ‌కాశం ద‌క్కినట్టే ద‌క్కి వెన‌క్కి వెళ్లింది. వ‌య‌సు చిన్న‌గా ఉందని రిజ‌క్ట్ చేశారు. ఆ త‌రువాత చాలా కాలం ప్ర‌య‌త్నం చేయ‌గా ఆమెకు కేవీ రెడ్డి పాతాళ‌భైర‌విలో చిన్న క్యారెక్ట‌ర్ ఇచ్చారు. ఆ త‌రువాత వ‌చ్చిన పెళ్లిచేసి చూడు సినిమా సావిత్రి న‌ట జీవితాన్ని మార్చేసింది. అందులో రెండో హీరోయిన్‌గా న‌టించింది. పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చినా అనుకున్న స్థాయికి ఎదిగేందుకు దేవ‌దాసు చిత్రం వ‌ర‌కు ఆగాల్సి వ‌చ్చింది. వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేవ‌దాసు సినిమా ఏ స్థాయిలో విజ‌యం సాధించిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దేవ‌దాసులో మ‌ద్యానికి బానిసైన నాగేశ్వ‌రరావును త‌ల‌చుకుంటూ త‌ల‌ను త‌లుపుకు బాదుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకోవాలి. ఈ స‌న్న‌వేశంలో సావిత్రి న‌టించ‌లేదు… జీవించింద‌ట‌. సీన్ పూర్త‌య్యాక కూడా అలానే క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఉండ‌టంతో నాగేశ్వ‌రరావు, వేదాంతం రాఘ‌వ‌య్య‌లు వ‌చ్చి ఓదార్చార‌ట‌. ఇంటికి వెళ్ల‌న త‌రువాత కూడా ఆమె అలానే ఆ సీన్స్ గురించే ఆలోచిస్తూ భోజ‌నం చేయ‌కుండా ఉండిపోయింద‌ట‌.

Visitors Are Also Reading