ఒకప్పటి స్టార్ డైరెక్టర్ లలో కళాతపస్వి కే విశ్వనాథ్ కూడా ఒకరు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. విశ్వనాథ్ పేరు వినగానే స్వాతిముత్యం, స్వయం కృషి, శంకరాభరణం లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. తెలుగు సినిమాల్లో సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. విశ్వనాథ్ తన మొదటి సినిమాను అక్కినేని నాగేశ్వరరావుతో తీశారు.
Advertisement
అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు చేశారు. ఎన్టీఆర్ డేట్స్ దొరకకపోవడంతో జీవనజ్యోతి అనే సినిమాను శోభన్ బాబు తో తెరకెక్కించారు. ఇక సినిమాల్లోకి రాకముందే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ తో అనుబంధం ఉంది. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తరవాత ఒకరినొకరు కలుసుకున్నారు. అయితే విశ్వనాథ్ అంటే కేవలం శంకరాభరణం లాంటి సినిమాలనే ప్రేక్షకులు గుర్తు చేసుకుంటారు.
Advertisement
Also Read: ఆర్ఆర్ఆర్‌కు వరుసగా శుభవార్తలు..!
కానీ శంకరాభరణం సినిమా థియేటర్లలో ఆడుతున్న సమయంలోనే ఆయన దర్శకత్వం వహించిన అల్లుడు పట్టిన భరతం సినిమా వచ్చింది. అదే విధంగా నూతన్ ప్రసాద్ కవితలతో ఓ సోషల్ డ్రామాను విశ్వనాథ్ తెరకెక్కించారు. అదే విధంగా కాలంతకులు అనే క్రైమ్ థ్రిల్లర్ ను కూడా తెరకెక్కించారు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు.
ఈ సినిమాకు విశ్వనాథ్ దర్శకత్వం వహించినప్పటికీ సినిమాలో గుర్రాలు, ఫైట్ సీన్లు ఉండటంతో కేఎస్ఆర్ దాస్ తో ఆ సన్నివేశాలను తెరకెక్కించారు. శంకరాభరణం కు ముందు కూడా విశ్వనాథ్ సినిమాల్లో సంగీతానికి ప్రాధాన్యత ఉండేది. కానీ ఆ సినిమా తరవాతనే విశ్వనాథ్ సినిమాల్లో సంగీతం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
Also Read: భానుడి భగభగలు.. 3 రోజుల పాటు జాగ్రత్త..!