Home » వడివేలు కెరీర్ నాశనం అవ్వడానికి అసలు కారణాలేంటి…?

వడివేలు కెరీర్ నాశనం అవ్వడానికి అసలు కారణాలేంటి…?

by Azhar
Ad

సినీ పరిశ్రమల్లో హీరోలతో సమానంగా కొంతమంది కమెడియన్లు పెను సంపాదించుకుంటారు. అలాంటి కమెడియన్ మన తెలుగులో బ్రహ్మానందం అయితే.. తమిళ్ లో వడివేలు. తమిళనాడు ప్రజలను నవ్వించాలంటే ఒక్క వడివేలుకె సాధ్యం అవుతుంది అనే రేంజ్ లో ఆయన పాపులర్ అయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత వంటి వారు కూడా వడివేలు డేట్స్ దొరక్క తన సినిమాలను వాయిదా వేసుకునేవారు. అలాంటి వడివేలు ఒక్కసారిగా సినిమాల్లో కనిపించకుండా పోవడానికి అసలు కారణాలు ఏంటి అనేది చూద్దాం.

Advertisement

వడివేలు తమిళ సూపర్ స్టార్ విజయకాంత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అందులో ఓ డైలాగ్ ఉంది. అదేంటంటే.. కాబోయే సీఎం విజయకాంత్ అని వడివేలు చెప్పాలి. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత 2011 ఎన్నికలో విజయకాంత్ పార్టీ అయిన MDMK మరియు జయలలిత పార్టీ అయిన ANNA DMK పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక అప్పటివరకు అధికారంలో ఉన్న DMK పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే జయలలిత పార్టీ తరపున చాలా మంది సినీ నటులు ప్రచారం చేయడంతో.. వారు కొంచెం ముందుకు వెళ్లారు.

Advertisement

Read More : అతియాను నిరాశకు గురిచేసిన రాహుల్..

అదే సమయంలో DMK పార్టీ విజయకాంత్ కు వ్యతిరేకంగా వడివేలును దించింది. ఆ ప్రచారంలో విజయకాంత్ ను ఏకిపారేసిన వడివేలు జయలలితను కూడా విమర్శించారు. కానీ ఎన్నికలో అమ్మ పార్టీనే గెలిచింది. ఆ వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు అమ్మ ఆర్డర్ వేసింది. వడివేలును ఎవరు సినిమాలో తీసుకోకూడదు. అతను ఏ సినిమాలో ఉన్న ఆ సినిమాకు అన్ని రకాల సమయసలు వస్తాయి అని బెదిరించారు. దాంతో ఆయనను కోలీవుడ్ బ్యాన్ చేసింది. కానీ జయలలిత మరణం తర్వాత ఈ మధ్య ఒకట్రెండు సినిమాలో వడివేలు కనిపించిన.. ఆయనకు ఒక్కపటిలా అవకాశాలు రావడం లేదు.

Visitors Are Also Reading