Telugu News » Blog » చిరంజీవి సురేఖల పెళ్లి వెనక జరిగిన ఈ కథ తెలుసా…ఎవ్వరికీ తెలియని ట్విస్ట్ ఇదే…!

చిరంజీవి సురేఖల పెళ్లి వెనక జరిగిన ఈ కథ తెలుసా…ఎవ్వరికీ తెలియని ట్విస్ట్ ఇదే…!

by AJAY
Ads

సినిమా తార‌ల పెళ్లిల్లు అంటే తామ‌రాకుపై నీటి బిందువు మాదిరే. కానీ ఇండ‌స్ట్రీలో కొంత‌మంది మాత్రం ఇత‌ర జంట‌ల‌కు ఆదర్శంగా నిలుస్తుంటారు. అలా టాలీవుడ్ లో చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్న జంట చిరంజీవి సురేఖ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి సురేఖ దంప‌తులకు రామ్ చ‌ర‌ణ్ తో పాటూ ఇద్ద‌రు కూతుల్లు ఉన్నారు. వారు ఒక‌రు శ్రీజ కాగా మ‌రొక‌రు సుస్మిత కొనిదెల‌.

అయితే చిరు సురేఖ‌ల పెళ్లి విషయంలో ఎన్నో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందా. చిరంజీవి అప్పుడ‌ప్పుడే ఇండ‌స్ట్రీలో హీరోగా ఎదుగుతున్న రోజులవి. కానీ అప్ప‌టికే సురేఖ తండ్రి అల్లు రామ‌లింగ‌య్య నిర్మాత‌గా న‌టుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు రామ‌లింగ‌య్య‌కు చిరంజీవి ఇండ‌స్ట్రీలో స్టార్ గా ఎదుగుతార‌ని న‌మ్మ‌కం క‌లిగింది. దాంతో చిరంజీవి గురించి ఆరా తీయాల‌ని అల్లు అర‌వింద్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

chiranjeevi-and-surekha

chiranjeevi-and-surekha

దాంతో అల్లు అర‌వింద్ చిరు గురించి తెలుసుకుని మంచివాడు అనే నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే అదే స‌మ‌యంలో సురేఖ‌కు ఓ క‌లెక్ట‌ర్ సంబంధం కూడా వ‌చ్చిందట‌. దాంతో క‌లెక్ట‌ర్ కు ఇచ్చి వివాహం జ‌రిపించాలా లేదంటే చిరంజీకి ఇచ్చి వివాహం జ‌రిపించాలా అని అల్లు ఫ్యామిలీ ఆలోచ‌న‌లో ప‌డింది. అయితే అప్పుడు అల్లు రామ‌లింగ‌య్య క‌లెక్ట‌ర్ న‌టుడు అని కాకుండా సురేఖ‌కు ఎవ‌రు న‌చ్చితే వారితోనే వివాహం జ‌రిపిస్తామ‌ని చెప్పారు.

కాగా సురేఖ కూడా త‌న‌కు చిరంజీవినే ఇష్ట‌మ‌ని చెప్పింది. ఆ తర‌వాత మెగాస్టార్ తండ్రి మొద‌ట సినిమా వాళ్ల‌తో సంబంధం వ‌ద్ద‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆ త‌ర‌వాత సురేఖ గురించి అల్లు రామ‌లింగ‌య్య మంచితనం గురించి తెలుసుకుని ఓకే చెప్పారు. అలా ఎన్నో ట్విస్ట్ ల న‌డుమ చిరు సురేఖ‌ల వివాహం జ‌రిగింది.

Also read : అప్పట్లోనే కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణం వల్లే చనిపోయాడా…!

 


You may also like