Home » మోహ‌న్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింద‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?

మోహ‌న్ బాబు రిజెక్ట్ చేసిన సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింద‌ని తెలుసా..? ఆ సినిమా ఏదంటే..?

by AJAY
Ad

కొన్ని సినిమాల‌ను మొద‌ట ఒక హీరోతో అనుకుంటారు. కానీ ఆ త‌ర‌వాత అనేక కార‌ణాల వ‌ల్ల మ‌రో హీరో చేతికి వెళ‌తాయి. అలా చేతులు మారిన సినిమాలు కొన్ని హిట్ అయితే మ‌రికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. అలాంటి ఓ సినిమా చిరంజీవి కెరీర్ లో కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఉన్నాయి. అయితే చిరు న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాల‌లో కొన్ని వేరే హీరోలు చేయాల్సి ఉండ‌గా ఆ త‌ర‌వాత అనేక కార‌ణాల వ‌ల్ల చిరు చేతికి వ‌చ్చాయి.

Advertisement

చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా హ‌క్కుల‌ను మొద‌ట హీరో రాజశేఖ‌ర్ సొంతం చేసుకోవాల‌ని అనుకున్నారట. కానీ ఆ త‌ర‌వాత అనేక రాజ‌కీయాలు న‌డిచి ఠాగూర్ సినిమా చిరంజీవి చేతికి వ‌చ్చింద‌ట‌. అంతే కాకుండా చిరంజీవి హీరోగా న‌టించిన బ్లాస్ బ‌స్ట‌ర్ సినిమా హిట్ల‌ర్ కు మొద‌ట హోహ‌న్ బాబును అనుకున్నారు నిర్మాత‌లు.

Advertisement

ఈ సినిమా క‌థ‌ను మోహ‌న్ బాబుకు చెప్పగా ఆయ‌న రిజెక్ట్ చేశారు. దాంతో ఈ సినిమా చిరంజీవి వ‌ద్ద‌కు వెళ్లింది. క‌థ చిరుకు న‌చ్చ‌డంతో ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక చిరు హిట్ల‌ర్ కు ముందు వ‌రుస‌గా మూడు ఫ్లాప్ ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాంతో హిట్ల‌ర్ సినిమా పైనే పూర్తి న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమాను కూడా మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన హిట్ల‌ర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు.

మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి హీరోగా న‌టించగా సిద్దిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ఎడిట‌ర్ మోహ‌న్ ఇవివి ద‌ర్శ‌కుడిగా సినిమాను చేయాల‌ని అనుకున్నాడు. ఇవివి ద‌ర్శ‌క‌త్వం అన‌డంతో మోహ‌న్ బాబు ఓకే చెప్పారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈవీవీ ఈ ప్రాజెక్ట్ నుండి ప‌క్క‌కు తప్పుకున్నాడు. దాంతో మోహ‌న్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యాడు. ఆ త‌ర‌వాత ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ హీరోగా తెర‌కెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్ట‌ర్ అయ్యింది.

Visitors Are Also Reading