Home » ఛత్రపతి శేఖర్ రాజమౌళి సినిమాల్లోనే ఎందుకు ఎక్కువగా నటిస్తారు ? దానికి కారణం ఇదే !

ఛత్రపతి శేఖర్ రాజమౌళి సినిమాల్లోనే ఎందుకు ఎక్కువగా నటిస్తారు ? దానికి కారణం ఇదే !

by AJAY
Ad

రాజ‌మౌళి సినిమాలో ఒక్క సినిమా చేసినా చాల‌ని బిజీగా ఉండే న‌టీన‌టులు సైతం క‌ల‌లు కంటారు. కానీ ఓ న‌టుడికి మాత్రం జ‌క్క‌న్న ప్ర‌తి సినిమాలోనూ ఓ పాత్ర ఉంటుంది. దాదాపుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అన్ని సినిమాల‌లోనూ ఆ న‌టుడు ఉన్నాడు. ఆ న‌టుడు మ‌రెవ‌రో కాదు చ‌త్ర‌ప‌తి శేఖ‌ర్. ఆయ‌న అస‌లు పేరు చంద్ర‌శేఖ‌ర్ కాగా ఛ‌త్ర‌పతి సినిమాలో న‌టించి పాపులారిటీని సంపాదించుకున్నాడు.
Also Read:  గాడ్‌ఫాద‌ర్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. మాట నిల‌బెట్టుకున్న మెగాస్టార్‌..!

Advertisement

 

ఛ‌త్ర‌ప‌తి సినిమాలో ప్ర‌భాస్ స్నేహితుడిలా న‌టించి చంద్ర‌శేఖ‌ర్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. సినిమాలో ప్ర‌భాస్ కాట్ రాజ్ ను కొట్టబోయే స‌మ‌యంలో ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అంతే కాకుండా విల‌న్ చేతిలో త‌న్నులు తిని చివ‌రికి ప్రాణాలు కోల్పోతాడు. ఈ సీన్ ఎమోష‌న‌ల్ గా ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యింది. ఇక రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసినా ఇత‌ర ద‌ర్శ‌కుల సినిమాల్లో శేఖ‌ర్ కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

Advertisement

అంతే కాకుండా శేఖ‌ర్ ప్ర‌స్తుతం టీవీ సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నాడు. అయితే అస‌లు ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ కు రాజ‌మౌళితో ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. జ‌క్క‌న్న త‌న ప్రతి సినిమాలో శేఖ‌ర్ కు ఎందుకు ఛాన్స్ ఇస్తాడు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. నిజానికి మొద‌ట శేఖ‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో శాంతినివాసం సీరియ‌ల్ లో న‌టించాడు.

ఆ సీరియ‌ల్ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక శేఖ‌ర్ టాలెంట్ గురించి తెలిసిన జ‌క్క‌న్న అప్ప‌టి నుండి త‌న ప్ర‌తి సినిమాలోనూ ఆఫ‌ర్ ఇస్తున్నాడు. అంతే కాకుండా శేఖ‌ర్ రాజ‌మౌళి ఇంటికి కూడా వెళుతూ ఉంటార‌ట‌. ఇంటికి వెళ్లిన ప్ర‌తిసారి జ‌క్క‌న్న తిన‌కుండా పంపించ‌రు అని ఓ ఇంట‌ర్య్వూలో శేఖ‌ర్ వెల్ల‌డించారు.

Also Read: గాడ్‌ఫాద‌ర్‌లో బిగ్‌బాస్ బ్యూటీ.. మాట నిల‌బెట్టుకున్న మెగాస్టార్‌..!

Visitors Are Also Reading