Home » “బింబిసార” సినిమాను బాల‌య్య‌తో చేయాల‌నుకున్నార‌ట‌….కానీ ఎలా మిస్స‌య్యిందంటే..?

“బింబిసార” సినిమాను బాల‌య్య‌తో చేయాల‌నుకున్నార‌ట‌….కానీ ఎలా మిస్స‌య్యిందంటే..?

by AJAY
Ad

నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల్లో బింబిసార బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌ల్యాణ్ రామ్ కెరీర్ లో ప‌టాస్, 118 మంచి విజ‌యాలు సాధించాయి. క‌ల్యాణ్ రామ్ ముందు నుండి ఒకే రక‌మైన సినిమాలు చేయ‌కుండా డిఫ‌రెంట్ సినిమాల‌లో న‌టిస్తూ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవ‌డానికి ట్రై చేస్తూనే ఉన్నాడు.

Advertisement

అలా చేస్తున్న క్ర‌మంలో బింబిసార‌తో కల్యాణ్ రామ్ క‌ల నెర‌వేరింద‌నే చెప్పాలి. ఈ సినిమాలో క‌ల్యాణ్ రామ్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఈ చిత్రానికి వ‌శిష్ఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మొద‌టి సినిమానే అయిన‌ప్ప‌టికీ వ‌శిష్ఠ బింబిసార లాంటి సోషియో ఫాంట‌సీ క‌థ‌లో లింక్ చేస్తూ సినిమా చేయ‌డం గొప్ప‌విష‌యం.

Advertisement

సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్స్ కూడా భారీగానే వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా క‌థ‌ను మొద‌ట ర‌వితేజ‌కు వినిపించ‌గా రిజెక్ట్ చేశార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా ను మొద‌ట బాల‌య్య‌తో చేయాల‌ని కూడా అనుకున్న‌ట్టు తెలుస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో హీరో క్రూర‌త్వం ప్ర‌ద‌ర్శిస్తాడు. అలాంటి పాత్ర చేస్తే బాల‌య్య ఇమేజ్ కు సెట్ అవ‌తుందో లేదో అని కూడా ఆలోచించార‌ట‌.

సినిమాలో హీరో….విల‌న్ ఇద్ద‌రూ క‌ల్యాణ్ రామే…కాబట్టి విల‌న్ గా బాల‌య్య‌ను అభిమానులు ఒప్పుకుంటారో లేదో అని డ్రాప్ అయ్యార‌ట‌. ఇక క‌ల్యాణ్ రామ్ కూడా సినిమాలో న‌ట‌న‌లో ఎక్క‌డా త‌గ్గలేద‌నే చెప్పాలి. ఇలాంటి సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూసి బింబిసార‌తో ఆక‌లి తీర్చుకున్నాడ‌నేలా త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. త‌న పాత్ర‌కు 100 ప‌ర్సెంట్ న్యాయం చేసి క‌ల్యాణ్ రామ్ మొత్తానికి నంద‌మూరి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చాడు.

Visitors Are Also Reading