Home » బాలయ్య బాబు డెడికేషన్ అంటే ఇది ! ఆ సినిమా కోసం ఏకంగా 10 రోజులు పాటు అన్నం తినకుండా…ఉన్నారట ..!

బాలయ్య బాబు డెడికేషన్ అంటే ఇది ! ఆ సినిమా కోసం ఏకంగా 10 రోజులు పాటు అన్నం తినకుండా…ఉన్నారట ..!

by AJAY
Published: Last Updated on
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఎన్టీఆర్ త‌న‌యుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బాల‌య్య కేవ‌లం ఒకేర‌క‌మైన పాత్ర‌ల‌తో కాకుండా విభిన్న అన్ని ర‌కాల పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. రొమాంటిక్ చిత్రాల‌తో పాటూ మాస్ సినిమాలు జాన‌ప‌ద చిత్రాల‌లోనూ న‌టించారు.

Advertisement

ఇక బాల‌య్య కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో భైర‌వ‌ద్వీపం సినిమా కూడా ఒక‌టి. ఈ జాన‌ప‌ద చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. సినిమాలో బాల‌య్య త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడు. సినిమాలో బాల‌య్య కుష్టివాడి గెట‌ప్ లోనూ నటించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గెట‌ప్ లో ఉన్న స‌మ‌యంలో బాల‌య్య ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ట‌.

Advertisement

ఈ గెట‌లో న‌టించిన‌న్ని రోజులూ బాల‌య్య ప‌ది గంట‌ల పాటూ భోజ‌నం చేయ‌కుండా ఉన్నార‌ట‌. గెట‌ప్ కోసం వేసుకున్న మేక‌ప్ వ‌ల్ల ఏమీ తిన‌లేక కేవ‌లం జూస్ లు మాత్ర‌మే తీసుకునేవార‌ట‌. అలా ప‌ది రోజుల పాటూ బాల‌య్య షూటింగ్ మొత్తం జూస్ ల‌తోనే గ‌డిపార‌ట‌. ఇక బాల‌య్య త‌న సినిమాల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ‌టం కొత్తేమీ కాదు. కొన్ని సినిమాల‌లో ఆయ‌న సొంతంగా డూప్ లేకుండా స్టంట్ లు కూడా చేస్తుంటారు.

మ‌రోవైపు బాల‌య్య సినిమా షూటింగ్ కోసం అంద‌రికంటే ముందే వ‌స్తార‌ని ఆయ‌న‌తో ప‌నిచేసిన న‌టీన‌టులు చెబుతుంటారు. ఎన్టీఆర్ ఎలాగైతే త‌న జీవ‌తంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డుచుకునేవారో బాల‌య్య కూడా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డుచుకుంటార‌ని అంటూ ఉంటారు. ఇక బాల‌య్య ప్ర‌స్తుతం గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

Visitors Are Also Reading