Home » చైల్డ్ ఆర్టిస్ట్ గా రానించిన షామిలి హీరోయిన్ గా ఫెయిల్ అవ్వడానికి ఆ త‌ప్పులే కార‌ణమ‌ట‌…ఆ తప్పు ఏంటంటే..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా రానించిన షామిలి హీరోయిన్ గా ఫెయిల్ అవ్వడానికి ఆ త‌ప్పులే కార‌ణమ‌ట‌…ఆ తప్పు ఏంటంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు వస్తుంటారు. అయితే కొద్ది మంది మాత్రమే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంటారు. ఇప్పటివరకు చూసిన‌ట్ట‌యితే చైల్డ్ ఆర్టిస్ట్ ల‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నటి బేబీ షామిలి. అంజలి సినిమాతో బేబీ షామిలి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి బేబీ షామిలి మొదట రాజేండాయ్ అనే తమిళ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అంజలి సినిమాలో మెంటల్లీ చాలెంజ్డ్ చైల్డ్ పాత్రలో నటించింది.

Advertisement

ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో బేబీ షామిలి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అంజలి సినిమాతోనే నేషనల్ అవార్డును సైతం అందుకుంది. అంతేకాకుండా బేబీ షామిలికి అప్ప‌ట్లో క్రేజ్ ఉండటంతో చైల్డ్ ఆర్టిస్టుల్లో అత్యధిక రెమ్యున‌రేష‌న్ ను సైతం అందుకుంది. ఏకంగా 42 సినిమాల్లో బేబీ షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. చిరంజీవి హీరోగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

Advertisement

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న బేబి షామిలి హీరోయిన్ గా మాత్రం రాణించలేకపోయింది. హీరోయిన్ గా సిద్ధార్థ్ తో కలిసి ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా బాగున్నప్పటికీ హిట్ అయినప్పటికీ బేబీ షామిలి లుక్స్ పై మాత్రం నెగిటివ్ టాక్ మొద‌లైంది. దాంతో తెలుగులో ఆఫర్లను అందుకోలేకపోయింది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇక ధనుష్ హీరోగా నటించిన కోడి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది.

అయితే షూటింగ్ కి సమయానికి రాకపోవడం… కొన్ని డిమాండ్స్ ను ముందు ఉంచడం వల్ల నిర్మాతలు విసిగిపోయారని తెలుస్తోంది. దాంతో ఆ సినిమా నుండి షామిలిని ఏకంగా ప‌క్క‌న పెట్టార‌ట‌. అంతేకాకుండా ఓయ్ సినిమా తర్వాత హీరోయిన్ గా న‌టించిన వయ్యూం తెట్టి పులి మొట్టి అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలోనూ షామిలి ప్ర‌వ‌ర్త‌న చూసి ద‌ర్శ‌క‌నిర్మాతలు విసిగిపోయారు అనే టాక్ కూడా ఉంది. ఇక‌చైల్డ్ ఆర్టిస్ట్ గా అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ప్ప‌టికీ హీరోయిన్ గా షామిలి నిల‌దొక్కుకోలేక‌పోవ‌డానికి ఆమె ఆటిట్యూడే కార‌ణమ‌ట‌.

Visitors Are Also Reading