Home » ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది” సినిమా గురించి మీకు తెలియని 9విషయాలు !

ఇండస్ట్రీ హిట్ “అత్తారింటికి దారేది” సినిమా గురించి మీకు తెలియని 9విషయాలు !

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాకాలం పాటు సరైన హిట్ లేక‌ బాధపడుతున్న సమయంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ మరో బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేదితో ప్రేక్షకులను పలకరించారు. అలా వరుస సూపర్ హిట్ లు పడటంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. అత్తారింటికి దారేది సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా…. సమంత ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.

Advertisement

అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో హంస నందిని ఇట్స్ టైం టూ పార్టీ నౌ….. అనే ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫర్ మొదట అనసూయ కి వెళ్ళింది. కానీ అన‌సూయ రిజెక్ట్ చేయడంతో హంస‌నందినిని ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ లో చెప్పారు. అయినప్పటికీ కథను విన్న పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఇలియానాను అనుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాక‌పోవ‌డంతో ఆస్థానంలో సమంతను తీసుకున్నారు. ఈ సినిమాలో కొంత భాగం ఫారెన్ లో చిత్రీకరణ జరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లొకేషన్ లను స్వయంగా పవన్ కళ్యాణ్ వెతికారు. స్పెయిన్ లో పవన్ సినిమా కోసం లొకేషన్లను వెతికి వచ్చారు. ఆ తర్వాత 45 రోజులపాటు అక్కడే షూటింగ్ జరిగింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ మధ్య ఉండే ఓ సీన్ కు పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా అత్తారింటికి దారేది సినిమాకు అవార్డుల పంట పండింది. 2013లో వచ్చిన ఈ సినిమాకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అదేవిధంగా ఈ చిత్రానికి ఆరు సైమా అవార్డులు సైతం వచ్చాయి. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్లకు అత్యధిక వ్యూస్ తో పాటు లైకులు వచ్చి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 187 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

Visitors Are Also Reading