Telugu News » Blog » న‌టి భానుప్రియ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..? సొంత ఇల్లు లేక చివ‌ర‌కి..?

న‌టి భానుప్రియ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..? సొంత ఇల్లు లేక చివ‌ర‌కి..?

by AJAY
Ads

టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా రానించిన వారిలో న‌టి భానుప్రియ కూడా ఒక‌రు. సాంప్ర‌దాయ నృత్యంతో హావ‌భావాల‌తో భానుప్రియ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. భానుప్రియ కెరీర్ లో స్వ‌ర్ణ‌క‌మ‌లం సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పించింది. కాగా భాను ప్రియ సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె పర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు..

Advertisement

భానుప్రియ తండ్రి ఏపీలోని రాజ‌మండ్రి ద‌గ్గ‌ర‌లోని ప‌ల్లె గ్రామానికి చెందిన‌వారు. కాగా బతుకుదెరువు కోసం చెన్నైకి వ‌ల‌స వెళ్లారు. అక్క‌డే భానుప్రియ చ‌దువుపూర్తి చేసుకోవ‌డంతో పాటూ క్లాసిక‌ల్ డ్యాన్స్ లో శిక్ష‌ణ తీసుకున్నారు. క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ గా కెరీర్ ప్రారంభించిన భానుప్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

ఇక భానుప్రియ‌కు సితారా సినిమాతో మంచి గుర్తింపు రాగా ఆ త‌ర‌వాత అన్వేష‌ణ‌, స్వ‌ర్ణ‌క‌మలం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కాగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమ‌యంలోనే భానుప్రియ పెళ్లిచేసుకుని భ‌ర్త‌తో అమెరికాకు వెళ్లిపోయారు. అక్క‌డ భానుప్రియ ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

Advertisement

అయితే కొంత‌కాలం త‌ర‌వాత భ‌ర్త‌తో విభేదాలు మొద‌ల‌య్యాయి. దాంతో భానుప్రియ తిరిగి ఇండియాకు చేరుకుంది. అంతే కాకుండా భాను ప్రియ భ‌ర్త డిజైన‌ర్ కాగా ఆర్థికి ఇబ్బందుల‌తో మ‌ర‌ణించాడు. ఇక ఇండియాకు వ‌చ్చిన త‌ర‌వాత భానుప్రియ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే అడ‌పాద‌డ‌పా ఆఫ‌ర్ ల వల్ల అద్దె ఇంట్లో భానుప్రియ ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ విష‌యాల‌ను సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఇమంది మీడియాకు వెళ్ల‌డించారు.