Home » విజయ్ సుతుప‌తి జీవితంలో ఇన్ని క‌ష్టాలు అనుభ‌వించాడా…? పెళ్లి కోసం దేశం వెళ్లి..!

విజయ్ సుతుప‌తి జీవితంలో ఇన్ని క‌ష్టాలు అనుభ‌వించాడా…? పెళ్లి కోసం దేశం వెళ్లి..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ గా ఎద‌గాలంటే అందం కావాల‌ని అనుకుంటారు. తెల్ల‌తోలు సిక్స్ ప్యాక్ ప‌క్కా ఉండాల‌ని అనుకుంటారు. అంతే కాకుండా వీటితో పాటూ బ్యాగ్రౌండ్ కూడా ఖ‌చ్చితంగా ఉండాల‌ని అనుకుంటారు. కాని అలాంటివేమీ లేకుండానే స్టార్ గా ఎద‌గ‌వ‌చ్చ‌ని త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ప్రూవ్ చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ లేదు. తెల్ల‌తోలు కాదు కానీ ప్ర‌స్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

స్టార్ డైరెక్ట‌ర్ ల‌కు సైతం డేట్స్ ఇవ్వ‌లేనంత బిజీగా మారిపోయాడు. అయితే ఈ స్థాయికి ఎద‌గ‌డానికి ముందు విజ‌య్ సేతుప‌తి ఎన్నో క‌ష్టాల‌ను కూడా ఎదుర్కున్నాడు. విజ‌య్ సేతుప‌తి విరుద్ న‌గ‌ర్ జిల్లా రాజపాలాయం గ్రామంలో పుట్టి అక్క‌డే చ‌దువుకున్నాడు. చ‌దువుకుంటున్న స‌మ‌యంలో ఖ‌ర్చుల కోసం సేల్స్ మ్యాన్, టెలిఫోన్ బూత్ ఆప‌రేట‌ర్ ఇలా చాలా ప‌నులు చేసాడు.

Advertisement

ఇక చ‌దువు పూర్తిచేసుకున్న త‌ర‌వాత ఓ సిమెంట్ ఫ్యాక్ట‌రీలో అసిస్టెంట్ మేనేజర్ కూడా ప‌నిచేశాడు. విజ‌య్ సేతుప‌తికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. కాగా త‌న చెల్లి పెళ్లి కోసం దుబాయ్ కి వెళ్లి అక్క‌డ మూడేళ్లు ప‌నిచేశాడు. 2003లో తిరిగి ఇండియాకు చేరుకున్నాడు. ఇండియాకు వ‌చ్చిన త‌ర‌వాత త‌న స్నేహితుల‌తో క‌లిసి ఇంటీరియ‌ర్ డిజైనింగ్ బిజినెస్ ను ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో విజ‌య్ సేతుప‌తిని చూసిన‌ ద‌ర్శ‌కుడు బాలు మ‌హేంద్ర నీ ముఖం ఫోటో జెనిక్ గా ఉంద‌ని చెప్పాడ‌ట‌.

దాంతో విజ‌య్ కి కొత్త ఆశ‌లు చిగురించాయి. మొద‌ట ఓ టీవీ షో నిర్వ‌హిస్తున్న షార్ట్ ఫిల్మ్స్ లో న‌టించాడు. ఆ త‌ర‌వాత కార్తీక్ సుబ్బారాజుతో క‌లిసి ప‌లు షార్ట్ ఫిల్స్మ్ లో న‌టించాడు. దాదాపు ఏడు సంవ‌త్స‌రాలు ఎన్నో చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించిన‌ప్ప‌టికీ ఎలాంటి గుర్తింపు రాలేదు. కాగా విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన రామ‌స్వామి నాట‌క‌చిత్రం సినిమాకు మూడు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. ఆత‌ర‌వాత పిజ్జా సినిమాలో హీరోగా న‌టించి మెప్పించాడు. ఇక విజ‌య్ న‌టించిన 96 సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో స్టార్ గా మారిపోయాడు. ప్ర‌స్తుతం విల‌న్ గా హీరోగా ఫుల్ బిజీగా మారిపోయాడు.

ALSO READ : ఆ స్టార్ హీరోయిన్ విషయం లో సీనియర్ ఎన్టీఆర్ చెప్పించిన జాతకమే నిజమయ్యిందట..! ఇంతకీ ఎవరా హీరోయిన్..?

Visitors Are Also Reading