టాలీవుడ్ కోల్పోయిన విలక్షణమైన నటుల్లో రియల్ స్టార్ శ్రీహరి కూడా ఒకరు. హీరోగా,విలన్ గా మరియు ఇతర పాత్రలు చేసి శ్రీహరి నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీహరి హీరోగా నటించిన కుబుసం, భద్రాచలం సినిమాలు మంచి విజయం సాధించాయి.అంతే కాకుండా ఢీ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చివరగా శ్రీహరి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా మగధీర.
ఈ సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో తన గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీహరి కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని ఓ పేద కుటుంబంలో శ్రీహరి జన్మించాడు. తనకు ఊహ తెలియకముందే కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. ఇక హైదరాబాద్ లో శ్రీహరి కుటుంబం పాల బిజినెస్ మరియు మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు.
Advertisement
Advertisement
శ్రీహరి కూడా తన సోదరులకు మెకానిక్ షెడ్ లో సాయం చేస్తుండేవారు. అయితే శ్రీహరికి బ్రూష్ లీ సినిమాలు అంటే చెప్పలేనంత ఇష్టం. దాంతో ఆయన జిమ్ నాస్టిక్ లో శిక్షణ తీసుకుని జాతీయస్థాయిలో రానించాడు. ఆ తరవాత హీరో అవ్వాలనే కోరిక శ్రీహరికి కలిగింది. దాంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు జరుపుతున్న సమయంలో దాసరి గుర్తించి బ్రహ్మనాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించకపోయినా శ్రీహరి మాత్రం దర్శకుల కంట్లో పడ్డారు. ఆ తరవాత రౌడీ ఇన్స్పెక్టర్, తాజ్ మహల్ సినిమాల్లో యంగ్ విలన్ రోల్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ తవరాత శ్రీహరి తన కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో మొదటిసారి సిక్స్ ప్యాక్ చూపించిన ఘనత కూడా శ్రీహరికే దక్కింది. ఆ తరవాత హీరోగా కూడా అవకాశాలు అందుకుని తన కోరికను తీర్చుకున్నారు. అలా అంచెలంచెలుగా శ్రీహరి టాలీవుడ్ లో ప్రముఖ నటుడిగా ఎదిగారు. కానీ శ్రీహరి మధ్యవయసులోనే కాలేయ సంబంధిత వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెల్లడం బాధాకరం.