Telugu News » Blog » సావిత్రితో క‌లిసి తాగుతూ ఆమెను దారుణంగా మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..చివ‌రికి అత‌డి వ‌ల్ల‌నే..!

సావిత్రితో క‌లిసి తాగుతూ ఆమెను దారుణంగా మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..చివ‌రికి అత‌డి వ‌ల్ల‌నే..!

by AJAY
Ads

మ‌హాన‌టి సావిత్రి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగ‌మ్మాయి అయిన సావిత్రి మొద‌ట నాట‌కాల‌లో న‌టించి ఆ త‌ర‌వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సావిత్రి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ హీరోల‌కు జోడీగా సినిమాలు చేసింది. కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రి జీవితంలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాలు కూడా ఉన్నాయి. జెమిని గ‌ణేషణ్ తో ప్రేమ పెళ్లి త‌ర‌వాత సావిత్రి జీవితం మారిపోయింది. మ‌ద్యానికి భానిస‌వ్వ‌డం..నిమ్మిన‌వారే దారుణంగా మోసం చేయ‌డంతో చివ‌రిరోజుల్లో సావిత్రి జీవితం దుర్బ‌రంగా మారిపోయింది.

Advertisement

ఇక తాజాగా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు విద్యా సాగ‌ర్ రెడ్డి సావిత్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. మ‌హాన‌టి సావిత్రి ఎప్పుడూ త‌ప్పు చేయలేద‌ని అన్నారు. న‌మ్మిన‌వాడే సావిత్రిని మోసం చేశాడ‌ని చెప్పాడు. ఆ వ్య‌క్తి త‌న‌కు భాగా తెలుసు అని అత‌ని పేరు సుబ్ర‌మ‌ణ్యం అని చెప్పారు. సుబ్ర‌మ‌ణ్యం సావిత్రి ఇంటి గుర్కా వ‌ద్ద ఉంటూ సావిత్రి కంట్లో ప‌డ్డాడ‌ని చెప్పారు.

Advertisement

సావిత్రి ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను బాబు అనే వ్య‌క్తి చూసుకునేవాడ‌ని అత‌డు సావిత్రిని ఎక్కువ‌గా తాగ‌నిచ్చేవాడు కాద‌ని చెప్పారు. కానీ డిప్రెష‌న్ లో ఉన్న సావిత్రి ప‌క్క‌న సుబ్ర‌మ‌ణ్యం చేరాడ‌ని ఆమెను తాగుడుకు మ‌రింత భానిస‌ను చేశాడ‌ని చెప్పారు. సుబ్ర‌మ‌ణ్యం సావిత్రితో క‌లిసి తాగుతూ ఆమెను తాగుడుకు భానిస‌ను చేశాడ‌ని అన్నారు.

అంతే కాకుండా సావిత్రి తాగిన‌మ‌త్తులో ఉన్న స‌మ‌యంలో ఆమెతో ఆస్తుల‌పై సంత‌కాలు చేయించుకున్నాడ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం పేరు చెప్పి ఆమె బంగారం మొత్తం తీసుకున్నాడ‌ని ఆరోపించారు. అలా చేయ‌డం వ‌ల్ల‌నే సావిత్రి చివ‌రికి డ‌బ్బులేకుండా ఒంట‌రిగా మ‌రణించార‌ని చెప్పారు.

Advertisement

also read :  తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?