హైదరాబాద్ మహానగరం సమీపంలో ఉన్నటువంటి ముచ్చింతల్ శ్రీరామనగరం ఏడోరోజు వైభవోపేతంగా శ్రీభగవద్రామానుజ సహసాబ్ది ఉత్సవాలు జరుగుతుతున్నాయి. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆశ్రమంలోని ‘స్టాట్యూ ఆఫ్ ఈ క్వాలిటీ’ని సందర్శించారు. దీంతో పాటు ఆశ్రమంలో నిర్మించిన 108 దివ్యదేశాలను సందర్శించారు.
తొలుత అమిత్ షా ప్రత్యేక విమానంలో లక్నో నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముచ్చింతల్ చేరుకున్నారు. విమానశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లారు. ఏడవరోజు శ్రీరామనగరంలో రథసప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు.
Advertisement
Advertisement
Also Read : సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని భేటి.. ఎందుకంటే..?
ఇవాళ యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకు శ్రీనారసింహ ఇష్టి జ్ఞానకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువులో భాగంగా పెరుమాళ్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేసారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజజీయర్ స్వామిజీ నిర్వహించారు. 11 వ శతాబ్దానికి చెందిన వైష్ణవ గురువు శ్రీరామానుజాచార్యలు స్మారకార్థం 216 అడుగుల ఎత్తు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Also Read : అంకాపూర్ చికెన్ ఎందుకంత ఫేమస్.. ఎలా వండుతారో తెలుసా..?