Home » గుడ్లు దొంగిలించాల‌నుకున్న అనుకున్న అమ్మాయికి ఊహించ‌ని షాక్‌..!అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

గుడ్లు దొంగిలించాల‌నుకున్న అనుకున్న అమ్మాయికి ఊహించ‌ని షాక్‌..!అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

by Anji
Ad

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తి వీడియో సోష‌ల్ పోస్ట్ చేయ‌డంతో త‌రుచూ ఏదో ఒక‌టి వైర‌ల్‌గా మారుతుంటాయి. వాటిలో కొన్ని భ‌యం క‌లిగించేవి ఉంటే.. మ‌రికొన్ని మాత్రం న‌వ్వులు పూయిస్తుంటాయి. ఇక మనిషి అయినా జంతువు అయినా.. ప‌క్షులు అయినా త‌మ పిల్ల‌ల జోలికి ఎవ‌రైనా వ‌స్తే ఊరుకుంటాయా మ‌రీ.. క‌న్న త‌ల్లి పిల్ల‌ల‌ను కాపాడుకునేందుకు ప్రాణాల‌ను తెగించి మ‌రీ పోరాడుతుంటాయి.

Advertisement

అది మ‌నుషులు అయినా.. జంతువులు అయినా పిల్ల‌ల కోసం ఎంత‌టికైనా తెగిస్తారు. ఇక కొంత మంది ఆక‌తాయిలు మాత్రం కావాల‌నే జంతువుల పిల్ల‌ల‌ను ప‌క్షుల గుడ్ల‌ను దొంగిలించే ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు అవి వారిపై దాడి చేస్తుంటాయి. దీనికి బెస్ట్ ఉదాహ‌ర‌ణ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఓ వీడియో అనే చెప్ప‌వ‌చ్చు. నెమ‌లి గుడ్డు దొంగిలించ‌డానికి ఓ అమ్మాయి ఏమి చేసిందో.. ఆ త‌రువాత ఏమి జ‌రిగిందో ఈ వీడియోలో చూడొచ్చు.

 

నెమ‌లి గుడ్డును దొంగిలించ‌డానికి ఓ అమ్మాయి య‌త్నించింది. దీంతో ఆ అమ్మాయికి నెమ‌లి చుక్క‌లు చూపించింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోలో నెమ‌లి త‌న గుడ్ల‌ను పొదుగుతున్న స‌మ‌యంలోనే ఓ అమ్మాయి అక్క‌డికి అక‌స్మాత్తుగా వ‌చ్చింది. వ‌చ్చి రావ‌డంతో నెమ్మ‌దిగా వెనుక నుంచి వ‌చ్చి నెమ‌లిని ఎత్తుకుని ప‌క్కకు విసిరేసింది. ఇక ఆ త‌రువాత గుడ్ల‌ను దొంగిలించ‌డం ప్రారంభించింది. గుడ్లు సేక‌రిస్తున్న త‌రుణంలోనే.. నెమ‌లి వెంట‌నే ఆమెపై ఒక్క‌సారిగా దాడి చేసింది. ఆ అమ్మాయి త‌ల‌పై నెమ‌లి కాళ్ల‌తో త‌న్న‌డంతో ఒక్క‌సారిగా ఆమె కుప్ప‌కూలిపోయింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

అన్న‌వ‌రం ప్ర‌సాదం అంత రుచిక‌రంగా ఉండ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

టిక్ టాక్ మ‌ళ్లీ భార‌త్‌కు రాబోతుందా..? ఆ సంస్థ‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారా..?

 

Visitors Are Also Reading