ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు అసలు ఊహించని షాక్ తగిలిందనే చెప్పవచ్చు. కీలక స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నెంబర్ 2 స్థానంలో ఉన్న షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలుగుతున్నారని టాక్. 14 ఏళ్ల నుంచి మెటాలో ఎంతో కీలకంగా వ్యవహరించిన షరిల్ తన పదవీ నుంచి దిగిపోతున్నట్టు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉండగా.. బోర్డు ఆఫ్ మెంబర్స్ లో మాత్రం సభ్యురాలిగా కొనసాగుతాను అని చెప్పారు.
Advertisement
ఫేస్బుక్ మాతృసంస్థ అయినటువంటి మెటాలో సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తరువాత స్థానంలో షెరిల్ శాండ్ బర్గ్ ఉన్నారు. ఆమె వైదొలగడాన్ని యుగం ముగింపు గా జుకర్ బర్గ్గా పేర్కొన్నాడు. 14 ఏళ్ల తరువాత నా మంచి స్నేహితురాలు భాగస్వామి షెరిల్ శాండ్ బర్గ్ మెటా నుంచి వైదొలిగినట్టుగా జుకర్ బర్గ్ ఫేస్ బుక్ అధికారిక పోస్ట్‌లో వెల్లడించారు. మెటాలో షరిల్ పాత్ర భర్తీ చేయలేనిదని.. జుకర్ బర్గ్ పేర్కొన్నారు. శాండ్ బర్గ్ వైదొలుగుతున్నారనే వార్త రావడంతోనే మెటా షేర్లు 2 శాతం పడిపోయాయంటే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
తదిపరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా జేవియర్ ఒలివాన్ ఉండబోనున్నారు. గతంలో శాండ్ బర్గ్ నిర్వహించిన విధులకు భిన్నంగా సీఓఓ విధులు ఉండనున్నట్టు తెలుస్తోంది. పేస్‌బుక్‌లో చేరే సమయంలో కేవలం ఐదేళ్లు మాత్రమే ఉంటానని శాండ్ బర్గ్ అనుకున్నా.. 14 ఏళ్ల పాటు కొనసాగినది. ప్రస్తుతం మెటా నుంచి వైదొలిగిన తరువాత ఛారిటీ, తన ఫౌండేషన్ లీన్ ఇన్ పై ఎక్కువ దృష్టి పెడతానని ఆమె వెల్లడించారు.
Also Read :
గుడ్లు దొంగిలించాలనుకున్న అనుకున్న అమ్మాయికి ఊహించని షాక్..!అసలు ఏమి జరిగిందంటే..?
“అర్జున్ రెడ్డి” సినిమాను రిజెక్ట్ చేసి బాధపడుతున్న హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా…!