Home » మహేష్‌బాబుకు సర్జరీ.. ప్ర‌స్తుతం రెస్ట్‌..!

మహేష్‌బాబుకు సర్జరీ.. ప్ర‌స్తుతం రెస్ట్‌..!

by Bunty
Ad

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు వైద్యులు. ప్రస్తుతం దుబాయ్‌లో మ‌హేష్ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే, మహేష్‌ ఆరోగ్యంపై గత కొంత కాలంగా సోషల్‌ మీడియాలో ఒక వార్త హల్‌ చల్‌ చేసిన‌ది. మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని కూడా ప్రచారం జ‌ర‌గింది. ఆయ‌న న‌టిస్తున్న‌ తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’ షూటింగ్‌ సమయంలో.. మహేష్‌ మోకాలికి చిన్న గాయం అయినట్టు స‌మాచారం.

Advertisement

 

 

Advertisement

తీవ్ర నొప్పితో బాధ‌ప‌డుతూ.. మ‌హేష్ వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా.. స‌ర్జ‌రీ అవ‌స‌రం అని స‌ల‌హా ఇవ్వ‌డంతో స్పెయిన్ వెళ్లి మోకాలికీ స‌ర్జ‌రీ చేయించుకున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. స‌ర్జ‌రీ త‌రువాత దుబ్బాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు ప్ర‌స్తుతం. విశ్రాంతి ముగించుకుని కోలుకున్న త‌రువాత ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్‌లో పాల్గ‌నున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి మహేష్ బాబు దీర్ఘకాలంగా బాధపడుతున్న మోకాలి నొప్పికి సర్జరీ చేయించుకున్న‌ట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading