Home » “అమీగోస్” బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి నమ్మలేని నిజాలు..!!

“అమీగోస్” బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి నమ్మలేని నిజాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే చెరువులో నీళ్ల లాంటిది.. చెరువులో పాత నీరు వెళ్లిపోగానే కొత్త నీరు వచ్చి పడ్డట్టు సినిమా ఇండస్ట్రీలో కూడా పాతవారు కాస్త డల్లవగానే కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తూ ఉంటారు. ఇదే కోవలో కన్నడకు చెందిన ఒక హీరోయిన్ తెలుగులో సత్తా చాటుకోవడానికి వస్తోంది.. ఆవిడే ఆశికా రంగనాథ్ .. కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అమీగోస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. మరి ఈ బ్యూటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

Advertisement

కన్నడలో 2016లో తెరకేక్కిన క్రేజీ బాయ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత శివరాజ్ కుమార్ హీరోగా చేసిన మాస్ లీడర్ సినిమాలో నటించింది. అంతేకాకుండా పునీత్ రాజకుమార్ హీరోగా నటించిన జేమ్స్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది ఈ అమ్మడు. కన్నడ ఇండస్ట్రీలో నటించిన ఈ భామ ఇతర ఇండస్ట్రీలో కూడా నటించలేదు.

Advertisement

అయితే 2022లో అధర్వ హీరోగా నటించిన “పట్టాతు అరసన్” మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న అమిగోస్ లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా ఫలితం పై ఆషికా బాగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందట. మరి చూడాలి సినిమా ఎంతటి హిట్ అవుతుందో ఈమెకి ఎంతటి పేరు వస్తుందో విడుదలయితే కానీ తెలియదు.

also read:

Visitors Are Also Reading