Home » తల్లిదండ్రుల సపోర్ట్ తలచుకొని ఎమోషనల్ అయిన ఉమ్రాన్ మాలిక్..!

తల్లిదండ్రుల సపోర్ట్ తలచుకొని ఎమోషనల్ అయిన ఉమ్రాన్ మాలిక్..!

by Azhar
Ad

ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి ఇప్పుడు టీం ఇండియాకు ఆడబోతున్న ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున అరంగేట్రం చేసిన మాలిక్.. ఆడింది మూడు మ్యాచ్లే అయిన తన స్పీడ్ తో అందరి దృష్టిలో పడ్డాడు. ఇక ఈ ఏడాది కూడా గంటకు 150 కీమీ వేగంతో బంతులు వేసిన మాలిక్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక తాజాగా తన సక్సెస్ కు తల్లిదండ్రుల చేసిన సపోర్ట్ తలచుకొని ఎమోషనల్ అయ్యాడు మాలిక్.

Advertisement

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాలిక్ మాట్లాడుతూ… నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అయితే నేను చిన్నపుడు మా గల్లీలో క్రికెట్ ఆడుతుంటే పక్కింటి వల్ల అద్దాలు పగిలి ఎప్పుడు మా ఇంటికి నాపై ఫిర్యాదులు వచ్చేవి. కానీ మా అమ్మ నాకు ఎప్పుడు మద్దతు ఇచ్చేది. ఏం పర్లేదు.. ఆడు అద్దాలే కదా అంటూ చెప్పేది. అప్పుడే మా అమ్మ నన్ను నమ్మింది. ఇప్పుడు నేను దానిని నిజం చేశాను.

Advertisement

మా అమ్మే కాదు… నాన్న కూడా ఎంతో మద్దతుగా నిలిచేవాడు.మా కుటుంబాన్ని మా నాన్నే అక్కడ పండ్లు, కూరగాయల షాప్ పెట్టి.. వాటిని అమ్ముతూ పోషించేవాడు. ఆయన ఇప్పటికి అదే పని చేస్తున్నాడు. నేను ఐపీఎల్ లో ఆడినప్పుడు ఆయన ఆ పని చేసేవాడు. ఇప్పుడు ఇండియాకు ఆడుతుంటే కూడా ఆ పనే చేస్తున్నాడు. చేస్తూనే ఉంటాడు కూడా..! ఎందుకంటే ఆయన ఎప్పుడు ఓ మాట చెబుతాడు. మన ఎంత ఎత్తుకు ఎదిగిన ఎక్కడి నుండి వచ్చాము అనే విషయాన్ని మరిచిపోకూడదు అంటుంటాడు అని ఉమ్రాన్ తెలిపాడు. ఇక ఈ నెల 9 నుండి ప్రారంభమయ్యే సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ కు ఎంపికైన ఉమ్రాన్ మొదటి మ్యాచ్ లోనే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంద అనేది.

ఇవి కూడా చదవండి :

సిరాజ్ వల్లనే గొడవ అంటున్న రియాన్ పరాగ్…!

పాకిస్థాన్ ఆటగాళ్ల పై ఉమ్రాన్ మాలిక్ షాకింగ్ కామెంట్స్… పొరపాటున కూడా..!

Visitors Are Also Reading