Home » పుష్ఫ 2 షూటింగ్ నుండి అస‌హ‌నంతో వెళ్లిపోయిన ర‌ష్మిక‌..అల్లుఅర్జున్ కార‌ణమంటూ ట్వీట్..!

పుష్ఫ 2 షూటింగ్ నుండి అస‌హ‌నంతో వెళ్లిపోయిన ర‌ష్మిక‌..అల్లుఅర్జున్ కార‌ణమంటూ ట్వీట్..!

by AJAY

పాన్ ఇండియా లెవ‌ల్ లో హిట్ అయ్యిన తెలుగు సినిమాల‌లో పుష్ఫ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టించగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక న‌టించింది. అంతే కాకుండా పుష్ఫ‌లో స‌మంత ఊ అంటావా మావ అంటూ స్టెప్పులు వేయ‌డం ఈ సినిమాకే మ‌రో హైలెట్.

అదేవిధంగా ఈ సినిమాలో సునీల్, అన‌సూయ, ఫ‌హ‌ద్ ఫాజిల్ ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించి త‌మ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ఈ సినిమాకు ఏ రేంజ్ లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్టార్ క్రికెటర్ లు సైతం గ్రౌండ్ లో పుష్ఫ మ్యాన‌ర‌జిమ్ ను చూపించ‌డంతో ఈ సినిమా క్రేజ్ ఎల్ల‌లు దాటిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది.

ALSO READ : రెండో పెళ్లికి రెడీ అవుతున్న సింగ‌ర్ కౌస‌ల్య‌…వ‌రుడు ఎవ‌రో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సంచ‌ల‌న వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదేంటంటే..పుష్ఫ 2 సినిమా సెట్ నుండి ర‌ష్మిక కోపంతో వెళ్లిపోయింద‌ట‌. షూటింగ్ లో అల్లు అర్జున్ ర‌ష్మిక‌ను ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. దాంతో ఆ అవ‌మానం త‌ట్టుకోలేక ర‌ష్మిక షూటింగ్ నుండి అస‌హ‌నంతో వెళ్లిపోయింద‌ట‌.

ఇక బ్రేకింగ్ న్యూస్ అంటూ సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు గా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ మ్యాట‌ర్ ను ట్వీట్ చేశాడు. ఇక ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైల‌ర్ అవుతుంది. అయితే ఉమైర్ సంధు ట్వీట్ ల‌కు విలువ లేకుండా పోయింది అన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో ప్ర‌భాస్ కృతిస‌న‌న్ ప్రేమ‌లో ఉన్నార‌ని…ఎంగేజ్మెంట్ కూడా త్వ‌ర‌లోనే ఉండ‌బోతుందంటూ ట్వీట్ చేశాడు. కానీ అదంతా ఉత్తుత్తి వార్త‌నే అని తేలిపోయింది. ఇప్పుడేమో ఉమైర్ బ‌న్నీని టార్గెట్ చేశాడు.

ALSO READ : రెండో పెళ్లికి రెడీ అవుతున్న సింగ‌ర్ కౌస‌ల్య‌…వ‌రుడు ఎవ‌రో ఏం చేస్తాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Visitors Are Also Reading