Home » శ్రీ‌శైలంలో 30 నుంచి ఉగాది మ‌హోత్స‌వాలు

శ్రీ‌శైలంలో 30 నుంచి ఉగాది మ‌హోత్స‌వాలు

by Anji
Ad

శివ‌రాత్రి బ్ర‌మ్మోత్స‌వాలను వైభ‌వంగా నిర్వ‌హించిన ప్ర‌ముఖ శైవ క్షేత్రం శ్రీ‌శైలం.. ఇప్పుడు ఉగాది మ‌హోత్స‌వాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. ఇత‌ర ప్రాంతాల నుంచి కూడ కొంద‌రూ మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి వ‌స్తుంటారు. ఉగాది మహోత్సవాలకు మాత్రం కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు.. పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.. ఈ సందర్భంగా వారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు అధికారులు.. శ్రీశైలంలో ఈనెల 30వ తేదీ నుండి ఏప్రిల్‌ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.

Advertisement


ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు భక్తులందరికీ స్వామివార్ల అలంకార దర్శనం ఉంటుందని.. ఉత్సవాలలో ప్రతిరోజు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం కొనసాగిస్తామని వెల్లడించారు.. నల్లమలలో పాదయాత్రగా వచ్చే కన్నడ భక్తులకు మంచినీరు, ఆహారం, వైద్యం ఏర్పాటుపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించారు అధికారులు.. పెద్ద ఎత్తున భక్తులు పాదయాత్రగా రావడం ఆనవాయితీగా వస్తుండడంతో.. కర్ణాటక, మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో దర్శనాలపై బీజాపూర్ లో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న.

Advertisement

Visitors Are Also Reading