దేశంలో హిజాబ్ ధరించి స్కూళ్లకు కాలేజీలకు వెళ్లడం ఇప్పుడే మొదలవ్వలేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి హిజాబ్ ధరించి స్కూళ్లకు పాఠశాలకు వెళుతున్నారు. కానీ ఇటీవల కర్నాటకలో హిజాబ్ లు ధరించి పాఠశాలలకు కాలేజీలకు రాకూడదని యూనిఫాం ధరించి రావాలని ఓ వర్గం వాదిస్తోంది. దాంతో గొడవలు జరిగి ఏకంగా విద్యాసంస్థల్లో దాడులకు దిగే వరకూ వ్యవహారం వెళ్లింది. దాంతో విద్యాసంస్థలను అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఎలాంటి గొడవలు లేకుండా పరీక్షలకు సిద్దం అవ్వాలని సీఎం బొమ్మై ప్రకటించారు.
udayanidi stalin
ఇదిలా ఉంటే దేశంలో అక్కడక్కడా ఇప్పుడు హిజాబ్ గురించి రచ్చ మొదలవుతోంది. తాజాగా హిజాబ్ సెగ తమిళనాడు రాష్ట్రాన్ని సైతం తాకింది. తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మదురైలో ఓటు వేసేందుకు ఓ మహిళ హిజాబ్ ధరించి రావడాన్ని అక్కడే ఉన్న ఓ బీజేపీ కార్యకర్త వ్యతిరేఖించాడు. ఆమెను ఓటు వేయనియ్యవద్దని రచ్చ చేశాడు.
దాంతో అక్కడే ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే నేతలు అతడిని బయటకు పంపాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి వాదనలను వ్యతిరేకించారు. దాంతో గొడవ చేస్తున్న అతడిని పోలీసుల బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వార్త తమిళనాడులో వైరల్ అయ్యింది.
కాగా దీనిపై సినీ హీరో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ స్పందించాడు. బీజేపీ ఎప్పుడూ ఇలానే చేస్తుంది. అలాంటి వాటికి మేం వ్యతిరేకం. ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని పక్కన పెట్టాలో మాకు బాగా తెలుసు. తమిళనాడు ఎట్టిపరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలను అంగీకరించదు. అంటూ ఉదయనిధి స్టాలిన్ ఫైర్ అయ్యారు.