ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది సమయంలోనే స్టార్ హోదా ను సంపాదించి దూసుకు పోయారు. ఆయన నటనా చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎదిగి చాలా తొందరగా అస్తమించిన హీరో. ఉదయ్ కిరణ్ జూన్ 26,1980 హైదరాబాదులో జన్మించాడు.
తండ్రి వీవీకే మూర్తి, తల్లి నిర్మల. ఆయన బీకాంలో పట్టభద్రుడయ్యాడు. రెండువేల సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్, కొద్ది సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలు ఉదయ్ కిరణ్ పేరు గగనతలంలోకి ఎత్తేసాయ్. ఆయనకు యూత్ అభిమానులే కాకుండా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు.
Advertisement
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజుల్లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు ఈ హీరో . కొద్దిరోజులు ప్రేమకు సంబంధించిన వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డాడు. ఇలా కెరీర్ స్టార్టింగ్ లోనే కొన్ని ఇబ్బందులు పడ్డ ఉదయ్ కిరణ్ అనేక ఒడిదుడుకుల మధ్య మంచి హీరోగా పేరు సంపాదించుకొని అనతి కాలం లోనే అస్తమించాడు మన అభిమాన హీరో ఉదయ్ కిరణ్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి యాదిలో..
1/20
2/20
3/20
4/20
5/20
Advertisement
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
1920
20/20
also read;
భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?
ట్విన్స్ బేబీస్ కి జన్మనిచ్చిన సింగర్ చిన్మయి.. మీరు కూడా ఓ లుక్కేయండి..!