Home » Uday kiran: అతడు మూవీని ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడం వెనుక..అసలు ట్విస్ట్ ఇదేనా..!

Uday kiran: అతడు మూవీని ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడం వెనుక..అసలు ట్విస్ట్ ఇదేనా..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం కొట్టడం ఖాయం అనే విధంగా ఉండేవి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ ఫుల్ బాటలో నడుస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చినటువంటి చిత్రం అతడు. ఈ మూవీ అప్పట్లోనే ఘన విజయం సాధించింది. ఇందులో మహేష్ యాక్షన్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక ఫైట్స్ తో దుమ్ము రేపేశారు. మహేష్ సరసన త్రిష కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది అని చెప్పవచ్చు. అంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ముందుగా త్రివిక్రమ్ ఉదయ్ కిరణ్ తో తీయాలని అనుకున్నారట. కానీ ఉదయ్ ఈ సినిమాను తిరస్కరించారని తెలుస్తోంది. ఆ సమయంలో త్రివిక్రమ్ మరియు తరుణ్ కాంబినేషన్ లో నువ్వే నువ్వే మూవీ వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు ఉదయ్ కిరణ్ అతడు మూవీ చేద్దామని అనుకున్నారట.ఈ సినిమా కోసం ఉదయ్ జయభేరి నిర్మాణ సంస్థ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నారని టాక్.కానీ అతనికి ఎన్ని ప్రయత్నాలు చేసినా డేట్స్ దొరక్కపోవడంతో, చివరికి ఉదయ్ ఈ సినిమాను చేయలేనని చెప్పారని తెలుస్తోంది. ఆయన తీసుకున్న అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేశారు. అయితే తర్వాత త్రివిక్రమ్ ఈ మూవీని పవన్ తో చేద్దామని భావించారట. కానీ పవన్ తో కూడా డేట్స్ సర్దుబాటు కాలేదట. ఇక మహేష్ బాబు ఆ సమయంలో నాని సినిమా షూటింగ్ లో ఉన్నారని, త్రివిక్రమ్ ఆయనను కలిసి స్టోరీ చెప్పారని, దీంతో మహేష్ బాబు సినిమాకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. అలా ప్రారంభమైన సినిమా బంపర్ హిట్ కొట్టింది.

Advertisement

ALSO READ;

Advertisement

సన్నజాజి తీగలా మారిన షాలిని పాండే.. కారణం..?

1951-1960 సూపర్ హిట్ అయినా 18 సినిమాలు ఇవేనా..?

 

Visitors Are Also Reading