Home » IND vs PAK: మరోసారి పాకిస్తాన్ కష్టాల్లో.. ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా పడుతుందా..?

IND vs PAK: మరోసారి పాకిస్తాన్ కష్టాల్లో.. ఛాంపియన్స్ ట్రోఫీ వాయిదా పడుతుందా..?

by Sravya
Ad

చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతుందా..? అయితే ఇప్పటికి ఈ ప్రశ్నకి సమాధానం దొరికేటట్టు కనబడలేదు. ఎందుకంటే వచ్చే ఛాంపియన్ ట్రోఫీ ని నిర్వహించే హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి అప్పగించింది ఐసీసీ. దీని ప్రకారం 2025 ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. కానీ పాకిస్తాన్లో టోర్నీ నిర్వహిస్తే భారత్ వెళుతుందా లేదా అనేది సందేహమే. దీంతో టోర్నని యూఏఈ కి మార్చే అవకాశం ఉన్నట్టు చర్చలు కూడా జరుగుతున్నాయి. టోర్నీని జరపడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోతే ఛాంపియన్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ ఫార్మేట్ లో నిర్వహిస్తారు.

Advertisement

టీమిండియా మ్యాచ్లకి యూఏఈ ఆతిథ్యం ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఈసారి ఆసియా కప్ నిర్వహించే హక్కు పాకిస్తాన్ బోర్డుకి ఉంది. కానీ భారతదేశపు పాకిస్తాన్ వెళ్లేందుకు వెనకడుగు వేస్తోంది. హైబ్రిడ్ మోడల్ ని నిర్వహిస్తే.. ఇది వరకు పాకిస్తాన్ శ్రీలంకలో నిర్వహించారప్పుడు. ఇక్కడ భారత జట్టు శ్రీలంక లో ఫైనల్ తో సహా అన్ని మ్యాచ్లు కూడా ఆడింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కి రావడానికి టీమిండియా సంకోచిస్తే టోర్నని మార్చే అవకాశం ఉంది.

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అలానే క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ కూడా దీనిపై చర్చించారు. భారత్ కనుక పాల్గొనడానికి వ్యతిరేకిస్తే చాంపియన్ ట్రోఫీ మ్యాచ్ లని యూఏఈకె మార్చాలని అంటున్నారు. సో ఈ లెక్కన భారత్ మ్యాచ్ లు యూఏఈ కి మారినా కూడా ఆశ్చర్య పడక్కర్లేదు. మరి దీని పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఏమంటారు..? భారత క్రికెట్ బోర్డు దీని గురించి ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. టైం ఉందని ఏమీ చెప్పలేదు. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ కి అర్హత సాధించిన జట్లు వివరాలు చూస్తే.. భారతదేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ (ఆతిథ్య దేశం), ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading