చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో ఉదయ్ కిరణ్. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లు దక్కించుకుని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ అందుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఉదయ్ కిరణ్ కు సినీ పరిశ్రమలో అనుకోని అడ్డంకులు ఎదురయ్యాయి.
Advertisement
Uday kiran
దాంతో సినిమా అవకాశాలు లేక తీవ్ర ఆవేదన చెందాడు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కానీ నీ అక్కడ కూడా ఉదయ్ కిరణ్ ను విధి వెక్కిరించింది. కుటుంబంలో కలహాలు ఎదురవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. చివరగా ఉదయ్ కిరణ్ చిత్రం చెప్పిన చిత్రం చెప్పిన కథ అనే సినిమాలో నటించాడు.
Advertisement
Also read : నాకు అల్లు అర్జున్ కు రెండేళ్లే తేడా…పుష్ప రాజ్ తల్లి కల్పలత..!
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఆ కానీ అదే సమయంలో ఉదయ్ కిరణ్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తర్వాత మళ్లీ అంతటి రికార్డును నెలకొల్పాడు. కమలహాసన్ అతి చిన్న వయసులో తన నటన తో ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులో ఫిలింఫేర్ అవార్డును అందుకుని విశ్వనటుడి తరవాత స్థానంలో నిలిచాడు.
Advertisement