సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు కామన్. ఇది ఏ భాషీయ చిత్ర పరిశ్రమలో అయినా ఉన్నదే. అంతే కాకుండా డేటింగ్ చేయడం ఆ తరవాత విడిపోవడం కూడా సర్వసాధారణమే. కానీ లేటు వయసులో డేటింగ్ లు చేసుకోవడాలు మాత్రం అప్పట్లో బాలీవుడ్ లో మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు ఈ సంస్కృతి టాలీవుడ్ కు కూడా పాకింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ నటుడు నరేష్ డేటింగ్ వ్యవహారం టాలీవుడ్ లో రచ్చలేపుతోంది. ఇప్పటికే నరేష్ కు మూడు పెళ్లిళ్లు అవ్వడంతో పాటూ విడాకులు తీసుకున్నాడు.
Also Read: Chanakya Niti : కష్ట, సుఖాల్లో తోడుగా ఉండే స్నేహితున్ని ఎంపిక ఎలాగో చెప్పిన చాణక్య
Advertisement
అంతే కాకుండా నటి పవిత్ర లోకేష్ కు కూడా కన్నడ నటుడితో వివాహం కాగా పిల్లలు పుట్టాక విడిపోయారు. ఇక గత కొంతకాలంగా నరేష్ పవిత్ర లోకేష్ లు కలిసి ఉంటున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతే కాకుండా వీరిద్దరినీ నరేష్ మాజీ భార్య ఓ హోటల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అలా నరేష్ పవిత్ర ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
పవిత్ర కన్నడ నటి కావడంతో అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నరేష్ పరువును ఆయన మాజీ భార్య బజారుకు ఈడ్చింది. దాంతో కన్నడ నాట కూడా పవిత్ర నరేష్ ల బంధం రచ్చ రచ్చగా మారింది. ఇదిలా ఉండగా నరేష్ పవిత్ర ల బంధం పై ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది.
Also Read: తెలంగాణలో ఉన్న మహాత్ముడి గుడి గురించి మీకు తెలుసా..?
పెళ్లి చేసుకోకుండా నరేష్ పవిత్రలోకేష్ ఓ అగ్రిమెంట్ ను చేసుకున్నారట. నరేష్ తో కలిసి ఉండటానికి పవిత్రకు నెలకు రూ.25లక్షల చొప్పున చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. అంతే కాకుండా భవిష్యత్ లో పవిత్రను విడిచిపెడితే రూ.50 కోట్లు భరణంగా ఇవ్వాలని కూడా అగ్రిమెంట్ లో రాసుకున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.