Home » ఈ కుక్క సంపాదన ఏడాదికి రూ.8 కోట్లు..?

ఈ కుక్క సంపాదన ఏడాదికి రూ.8 కోట్లు..?

by Bunty

సాధారణంగా కుక్కల పెంపకం అనేది కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలామంది కుక్కలను పెంచడానికి ఇష్టపడరు. దానికి పెట్టే డబ్బులతో మనకు ఇంట్లో ఖర్చులకు డబ్బులు మిగులుతాయని అనుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయితే కుక్కల వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అని మాత్రమే తెలుసు. కానీ ఓ కుక్క మాత్రం చాలా విచిత్రంగా కొన్ని కోట్లలో డబ్బులను సంపాదిస్తుంది.

ఓ కుక్క ఏకంగా లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా ఏడాదికి 8 కోట్లను సంపాదిస్తుంది. కుక్కలు ఏంటి డబ్బు సంపాదించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా… అయితే దీని గురించి తెలుసుకుందాం. కొంతమంది యూట్యూబ్ లో కొన్ని వంటల వీడియోలు, సినిమాల గురించి, ట్రావెల్స్ గురించి వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. తాజాగా టక్కర్ అనే ఓ కుక్క తన యజమాని చెప్పినట్టు విని ఆ యజమాని చెప్పిన పని నేర్చుకొని ఆ కుక్క ఒక సంవత్సరంలో 8 కోట్ల రూపాయలను సంపాదిస్తుందని తెలుస్తోంది.

జూన్ 7 2018లో టక్కర్ మొదటి వీడియో వైరల్ అయిందని అతను చెప్పాడు. అప్పుడు టక్కర్ వయసు ఆరు నెలలు మాత్రమే. ఇక డాగ్ లవర్స్ టక్కర్ వీడియోలను తెగ ఇష్టపడుతున్నారు. టక్కర్ పేరు మీద ఇన్ స్టాగ్రామ్ లో 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్ లో 4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో టక్కర్ కు యూట్యూబ్ లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ విధంగా టక్కర్ డబ్బు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sharwanand : హీరో శర్వానంద్‌ కు ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి ముందే దారుణం !

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !

Visitors Are Also Reading