తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని గురించి ఎంత చెప్పినా.. తక్కువే అవుతుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం పలుమార్పులు చేస్తోంది. దీనిలో భాగంగా దివ్య దర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని శుక్రవారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని మార్చింది.
READ ALSO : Posani Krishna Murali : మూడోసారి కరోనా బారిన పడిన పోసాని… ఆసుపత్రికి తరలింపు
Advertisement
ఇప్పటివరకు కాలిబాట, గాలి గోపురం వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేశారు. అయితే శుక్రవారం నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నవారు అలిపిరి నుంచి నడిచి వెళ్లి గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకోవాలని తెలిపారు. ఇలా చేస్తేనే దర్శనానికి అనుమతి లభిస్తుందని టీటీడీ తెలిపింది.
Advertisement
READ ALSO : CSK ఫ్యాన్స్ కు షాక్..IPL 2023 నుంచి ధోని ఔట్ ?
కాగా, కరోనా కారణంగా మూడేళ్లుగా దివ్య దర్శనం టోకెన్లు జారీ నిలిపివేయగా, తిరుమల కాలినడక మార్గాలు, దివ్య దర్శనం టోకెన్ల జారీ ఇటీవలే మళ్లీ ప్రారంభించారు. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద రోజుకు పదివేల టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద రోజుకు 5వేల దివ్య దర్శనం టోకెన్లను లభించనున్నాయని తిరుమల అధికారులు తెలిపారు. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం యధావిధంగా దివ్యదర్శనం టోకెన్లను ఇవ్వనున్నారు.
READ ALSO : Shaakuntalam review : శాకుంతలం రివ్యూ.. సమంత ఖాతాలో భారీ డిజాస్టర్ ?