Home » తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల

by Anji
Ad

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే  9,168 పోస్టులకు అనుమతి ఇచ్చిన విషయం విధితమే.  తాజాగా టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 9,168 పోస్టులు గ్రూప్-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 23, 2022 నుంచి జనవరి 12, 2023 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హతలు, ఖాళీలు, వేతనం తదితర వివరాలతో సమగ్రంగా నోటిఫికేషన్ డిసెంబర్ 23 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నట్టు కమిషన్ కార్యదర్శి వెల్లడించారు. 

Advertisement

దాదాపు 25 విభాగాలలో ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూప్-4 లో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించినట్టుగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది.

Advertisement

Also Read :  ఎన్టీఆర్ ఫ‌స్ట్ హీరోయిన్ ఆస్తుల‌న్నీ ప్ర‌భుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుందో తెలుసా…? ఇంట్రెస్టింగ్ స్టోరీ..?

Manam News

గ్రూప్-4 లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులను చేర్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. తాజాగా టీఎస్పీఎస్సీ  విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ పోస్టులు భారీగానే ఉన్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.  ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఇది అనువైన అవకాశం అని గమనించగలరు. 

 Also Read :  విడాకులకు ప్రధాన కారణాలు ఇవేనట..!

Visitors Are Also Reading