టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్ అధికారులు టిఎస్పిఎస్సి కి అందజేశారు. సిట్ నివేదికలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగానే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. అయితే టీఎస్పీఎస్సీ రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇప్పుడు చూద్దాం.
Advertisement
read also : Rangamarthanda Teaser : బ్రహ్మానందం విశ్వరూపం.. శ్రద్ధగా చెక్కిన కృష్ణవంశీ!
ఏఈ పరీక్ష రద్దు
దాదాపు 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 50 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏఈ ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది మార్చి 5న జరిగింది. ఏఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని సీట్ అధికారుల విచారణలో బయటపడటంతో ఈ పరీక్షను రద్దు చేశారు.
Advertisement
గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు
503 పోస్టులకు అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. అన్ని సక్రమంగా జరిగి ఉంటే జూన్ 11న గ్రూప్ 1 మెయిన్స్ జరగాల్సి ఉంది.
ఏఈఈ పరీక్ష రద్దు
1540 పోస్టుల భర్తీకి జనవరి 1న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 81,548 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
డిఏఓ పరీక్ష రద్దు
53 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించారు. 1,06,253 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా
1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ లేదా జూలైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా జూనియర్ లెక్చరర్ పరీక్షను వాయిదా వేసింది.
టౌన్ ప్లానింగ్ అప్లికేంటెంట్ పరీక్ష వాయిదా
175 టౌన్ ప్లానింగ్ పరీక్ష కోసం 55,000మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీని ప్రకటించేలోపే ప్రశ్నపత్రాల లీకుల కారణంగా పరీక్షను రద్దు చేశారు.
Advertisement
READ ALSO : NTR నుంచి మనోజ్ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్లు ?