తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం.. ఆరా తీసే కొద్ది పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉంది. ఈ తరుణంలోనే, తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ సాంఘిక సంక్షేమం గురుకుల విద్యాసంస్థల్లోని డిగ్రీ కళాశాలలో… డైరెక్ట్ ప్రతిపాదికన 868 డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
READ ALSO : DK లాగే… భార్య చేతిలో మోసపోయిన బాధితులు వీళ్లే…!
Advertisement
తెలుగు, ఇంగ్లీష్, మాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్, జర్నలిజం తదితర సబ్జెక్టులో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యుజిసి నెట్/స్లేట్/సెట్ లో అర్హత సాధించి ఉండాలి.
Advertisement
READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..
అభ్యర్థుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్న అభ్యర్థులు మే 17, 2023వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులు రూ.600 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించవలసి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.58,850 ల నుంచి రూ.1,37,050 ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
READ ALSO : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!