Home » TS Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2054 ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే

TS Court Jobs : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 2054 ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభ వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కోర్టుల్లో, 2,054 జడ్జీలు, స్టేనోలు, ఎగ్జామినర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిల్లో 150 జడ్జి పోస్టులు, 1,904 ఇతర పోస్టులు ఉన్నాయి.

Advertisement

ఈ పోస్టులన్నింటికీ కలిపి దాదాపు 8 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జడ్జి పోస్టులకు జూన్ లో రాతపరీక్ష, సెప్టెంబర్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఫలితాలను సెప్టెంబర్ లోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి కొత్త జడ్జీలు విధుల్లో చేరేలా ప్రణాళికను రూపొందించింది. జిల్లా కోర్టుళల్లో ఉన్న 1904 జూడిషియల్, మినిస్టీరియల్ సబర్డినేట్ సర్వీస్ పోస్టులను ఆయా జిల్లా జడ్జిలు భర్తీ చేస్తారని హైకోర్టు పేర్కొంది.

Advertisement

జూనియర్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ప్రాసెస్ సర్వర్లు, ఆఫీస్ సబార్డినేట్ల పోస్టులకు మార్చిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది. 33 జిల్లాల్లోని కోర్టులతో పాటు నగరంలోని సిటీ సివిల్ కోర్టు తదితరాల్లో ఉన్న ఖాళీలను విడివిడిగా గుర్తించింది. వీటితో పాటు స్టేనోగ్రాఫర్లు, టైపిస్టులు, కాపీయిస్టుల పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేయనున్నారు.

read also : విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

Visitors Are Also Reading