Home » పెంపుడు కుక్కతో డబ్బుల ప్రయత్నం.. నెటిజన్స్ ఏమన్నారంటే ?

పెంపుడు కుక్కతో డబ్బుల ప్రయత్నం.. నెటిజన్స్ ఏమన్నారంటే ?

by Anji
Ad

సాధారణంగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని చూసినటువంటి నెటిజన్లు డాగ్ లవర్స్ అలా చూస్తుండిపోతారు. వాటితో వారి రోజు గడిచిపోయేలా గడిపేస్తుంటారు. ట్రెండింగ్ వీడియోల్లో కుక్కల మాదిరిగా తమ పెంపుడు కుక్క కూడా చిలిపి పనులు చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు.. తమ ఇంట్లోని పెంపుడు కుక్కలతో లాభాలు గడించాలని లేదా వాటితో డబ్బులు సంపాదించాలని కోరుకోరు. ప్రస్తుతం ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :  రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా ? ఎలా ఉందంటే..?

Advertisement

ఈ వీడియోలో పెంపుడు కుక్కకు దాని యజమాని డబ్బులు తీసుకురావాలని రోజుకు కనీసం 3,4 అయినా రూ.500 నోట్లు తీసుకురావాలని చెబుతాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల కంట పడడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  Prabhat-ranjan21 ఇన్ స్టా ఖాతా నుంచి షేర్అయిన ఈ వీడియోని చూడవచ్చు. పెంపుడు కుక్కకు దాని యజమాని రూ.500 నోటుని చూపించి అలాంటి నోట్లను రోజుకు కనీసం 3,4 తీసుకురావాలని చెబుతాడు. అవి కనిపించిన వెంటనే నోట్లో పెట్టుకొని తీసుకురావాలని నమిలేయకూడదని.. రూ.500 నోటు వాసన గుర్తుంచుకోమని చెబుతాడు. ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియదు.

ఆ వ్యక్తి వేసిన ప్లాన్ నెటిజన్లకు తెగ నవ్వు తెప్పిస్తోంది. దీంతో వారు రకరకాల కామెంట్స్ తో స్పందిస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 36వేలకు పైగా లైకులు, 4లక్షల 60వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. పలువురు నెటిజన్లు వీడియోపై స్పందనను కామెంట్ రూపంలో తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ వావ్.. ఆ కుక్కపిల్ల ఎంత క్యూట్ గా ఉంది. ఎంత ముద్దుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడో అంటూ కామెంట్ చేసారు. మరో నెటిజన్ ఈమాత్రం ఆలోచన నాకు రాలేదు. వచ్చి ఉంటే ఈ పాటికి వేలకు వేలు సంపాదించేవాడినని సరదాగా చెప్పుకొచ్చాడు. బ్రో మీ కుక్కపిల్ల మీ మాట వింటే.. త్వరలో ధనవంతుడిని అవుతావులే అని చెప్పుకొచ్చాడు. 

Also Read :  పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading