TRUE LOVER MOVIE REVIEW : ప్రభురామ్ రామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మూవీ లవర్. దీనిని తెలుగులో ట్రూ లవర్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్. ఇందులో మణకందన్, గౌరీ ప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్ గతంలో వీరికి యూత్ సినిమాలు చేసిన అనుభవం ఉండటం పాటు ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేశారు. ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరి 09న విడుదల కాగా.. తెలుగులో మాత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కథ మరియు విశ్లేషణ :
దివ్య (గౌరీప్రియ), అరుణ్ (మణికందన్) ఇద్దరూ కళాశాల నుంచే ప్రేమించుకుంటారు. దివ్య ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తుండగా.. అరుణ్ ఇంట్లో 15 లక్షలు తీసుకొని ఒక కాఫీ షాపు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దివ్య తన తోటి ఉద్యోగస్తులతో కాస్త క్లోజ్ గా ఉండటంతో ఆమె వారితో ఎక్కడ ప్రేమలో పడుతుందో అని కొంచెం పొసెసివ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అరుణ్. అతని అనుమానం తట్టుకోలేక ఉన్నానో అనే విషయాన్ని సైతం దాచేసే స్థితికి దివ్య చేరుకుంటుంది. ఆఫీస్ ఫ్రెండ్స్ తో ఉన్నానని చెబితే ఎక్కడ అరుణ్ తో ఇబ్బంది కలుగుతుందోనని ఎప్పటికప్పుడూ ఏదో ఒక అబద్దం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా అబద్దం చెప్పిన కొద్ది సేపటికే అరుణ్ కి దొరిక్కి పోవడం.. గొడవ కావడం సారీ చెప్పడం సాధారణం అవుతుంది. దివ్య కోసం అరుణ్ ఉద్యోగంలో చేరతాడు. కాఫీ షాపు పనుల్లో పడి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడంతో ఉద్యోగం నుంచి తీసేస్తారు. దివ్య ఇతని లవ్ కి బ్రేక్ అప్ చెబుతుంది. అసలు దివ్య మీద అరుణ్ కి అనుమానం రావడానికి కారణం ఏంటి..? దివ్య, అరుణ్ ప్రేమ ఫలించిందా..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా వీక్షించాల్సిందే.
Advertisement
ప్రేమ కథలు ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ప్రేమ ఆధారంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన సరికొత్త సినిమా ట్రూ లవర్. వాస్తవానికి ట్రూ లవర్ అంటే అర్థం నిజమైన ప్రేమికుడు అని.. మోడర్న్ యూత్ మధ్య మధ్యలో జరిగిన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో అనుమానాన్ని పొసెసివ్నెస్ పేరుతో కప్పి పుచ్చుకుంట అదే నిజమైన ప్రేమ అంటూ యువత ఎటువైపు పయణిస్తోంది.. అని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చలు చూస్తూనే ఉంటాం. ఈ అనుమానపు ప్రేమ వల్ల మానసిక క్షోభకు ఎలా గురయ్యారు..? దీంతో వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎప్పుడూ గొడవ జరగడం.. కలిసి పోవడం వంటి సీన్స్ చూస్తే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో హీరో ఎక్కువగా స్మోక్ చేసే సీన్లలో కనిపిస్తాడు. సినిమా చివరి వరకు ఒకే పాయింట్ చుట్టూ తిప్పే యత్నం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. గతంలో ప్రేమించి ప్రేమకి దూరంగా ఉన్న వారు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశముంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.
పాజిటివ్ పాయింట్స్ :
- చూపించిన కొన్ని సీన్స్
- డైలాగ్స్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
- తెలిసిన కథ
- ల్యాగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్ : 3/5